.
సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఈటీ’ (ఈతర్య్క్యమ్ తునింధవన్). సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ప్రియాంకా అరుల్ మోహనన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సత్యరాజ్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కావాల్సింది. తాజాగా ఈ సినిమాను మార్చి 10కి వాయిదా వేస్తూన్నట్లుగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు సూర్య హీరోగా నటించిన ‘శూరారై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హాద్దురా’), ‘జై భీమ్’ చిత్రాలు ఓటీటీలో విడుదలైయ్యాయి. ఈ నేపథ్యంలో ఈటీ చిత్రం కూడా ఓటీటీలో రిలీజ్కానుందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ఈటీ రిలీజ్ డేట్ మార్చి 10 అని ప్రకటించడంతో ఈటీ ఓటీటీ అనుమానాలు తీరిపోయాయి. దీంతో సూర్య ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.
థియేటర్స్లో ఈటీ..నో ఓటీటీ..రిలీజ్ తేదీ చెప్పేశారు


Leave a comment
Leave a comment