పలుమార్లు వాయిదా పడిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ఫైనల్‌గా మార్చి 25న రిలీజ్‌ను కన్పార్మ్ చేసుకుంది. ఈ భారీ ప్యాన్‌ఇండియన్ మూవీ రిలీజ్ అవుతున్న ఈ తేదీన మరే సినిమా విడుదల కాదు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం వాయిదా పడుతుందెమోనని రవితేజ భావిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజ్ ఆగిపోతుందని ఊహించడమే కాదు.. ఒకవేళ వాయిదా పడితే తాను హీరోగా నటించిన ‘రామారావు:ఆన్ డ్యూటీ’ చిత్రం మార్చి 25న విడుదల చేస్తామని ప్రకటించారు. ఒకవేళ ఆర్‌ఆర్‌ఆర్ మార్చి 25న విడుదలైతే తన ‘రామారావు: ఆన్ డ్యూటీ’ సినిమాను ఏప్రిల్ 15న విడుదల చేస్తామని రవితేజ చెబుతున్నారు. ఇక శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రామారావు:ఆన్ డ్యూటీ’ చిత్రంలో రవితేజ ఎమ్మార్వోగా నటించారు. ట్రైన్‌లో జరిగే ఓ ఫైర్ యాక్సిడెంట్ ప్రధానాంశంగా ‘రామారావు:ఆన్ డ్యూటీ’ చిత్రం ఉంటుంది.
ఆర్‌ఆర్‌ఆర్ విడుదల వాయిదా పడుతుందెమోనని..


Leave a comment
Leave a comment