‘నార్కొండపర్వై’ (హిందీ హిట్ ‘పింక్’ తమిళం రీమేక్), ‘వలిమై’ చిత్రాల తర్వాత హీరో అజిత్‌కుమార్, దర్శకుడు హెచ్ వినోద్, నిర్మాత బోనీకపూర్ కాంబినేషన్‌లో ముచ్చుటగా మూడో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకోసం అదితిరావ్ హైదరీని సంప్రది స్తున్నారట చిత్రబృందం. అలాగే ఇదే సినిమాలోని మరో మెయిన్ లీడ్ క్యారెక్టర్ కోసం నాగార్జున, మోహన్‌లాల్ పేర్లను బోనీకపూర్ అండ్ కో పరిశీలిస్తున్నారన్నది లేటెస్ట్ టాక్. అయితే ఈ పోలీసాఫీసర్ పాత్రకు నాగార్జున అయితేనే బాగుంటుందని, గతంలో పోలీస్‌గా నాగార్జున చేసిన కొన్ని పాత్రలు హైలైట్‌గా ఉన్నాయి కాబట్టి నాగార్జున వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తు న్నాయి. ఇటు నాగార్జున కూడా రణ్‌బీర్‌కపూర్ హీరోగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఓ రోల్ చేశారు. దీంతో అజిత్ సినిమాకు నాగార్జున ఆల్మోస్ట్ ఒకే చెప్పే చాన్సెస్ ఉన్నాయి. అయితే గతంలో ధనుష్‌తో నాగార్జున చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయ్యింది. మరి..ఇప్పుడు మరో తమిళం హీరో అజిత్ సినిమాలో నాగార్జున పోలీసాఫీసర్‌గా ఓ లీడ్ రోల్ చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక నాగార్జున హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘ఘోస్ట్’ నెక్ట్స్ షెడ్యూల్ దుబాయ్‌లో ప్రారంభం కానుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాజీ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నాగార్జున కనిపిస్తారని తెలుస్తోంది.