హిట్ ఫిల్మ్ ‘జనతాగ్యారేజ్’ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపుదిద్దుకుం టున్న సినిమా ‘దేవర’. ఈ సినిమాతో జాన్వీకపూర్ (శ్రీదేవి పెద్ద కుమార్తె) హీరోయిన్గా తెలుగు చిత్ర పరి శ్రమలోకి అడుగు పెడుతున్నారు. కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలిభాగం ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబరు 10న విడుదల అవుతుంది. కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ గోవాలో ప్రారంభమైంది. ఎన్టీఆర్, జాన్వీకపూర్ పాల్గొనగా, ఓ సాంగ్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఈ షెడ్యూల్ పది రోజుల పాటు జరుగుతుంది. సైఫ్అలీఖాన్ ఈ చిత్రంలో విలన్ రోల్ చేస్తున్నారు.
NTR Devara: దేవర ముందు ఎన్నో అడ్డంకులు
Tollywood Dussehra 2024: టార్గెట్ దసరా…సెంటిమెంట్ బోనస్!
‘దేవర’ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తండ్రి, కొడుకుల పాత్రల్లో ఎన్టీఆర్ కనిపిస్తారు. భారత దేశంలో విస్మరణకు గురైన తీరప్రాంతావాసుల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ‘దేవర’ పాత్రలో ఎన్టీ ఆర్, తంగమ్ పాత్రలో జాన్వీకపూర్ నటిస్తున్నారు. సీరియల్ నటి చైత్ర, మరాఠి నటి శ్రుతీ మరాఠే కీలక పాత్రల్లో కనిపిస్తారు. దేవర భార్యగా శ్రుతీ, సైఫ్ భార్యగా చైత్ర, యంగ్ ఎన్టీఆర్‌కు జోడీగాజాన్వీ కనిపిస్తారని తెలి సింది. నిజానికి ఈ సినిమాను తొలుత ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. ఆ తర్వాత అక్టోబరు 10కి వాయిదా వేశారు.‘దేవర’ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. ‘దేవర’లో శ్రీకాంత్, ‘దసరా’ విలన్ షైన్ టామ్లు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారు.