నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సినిమా లో నితిన్‌కు జోడీగా కృతీశెట్టి నటిస్తున్నారు. ఈ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ సినిమాలో పొలిటికల్అం శాలు హైలెట్ కానున్నాయి. భీష్మ, మాస్ట్రో వంటి చిత్రాల తరువాత మూడోసారి మహతి స్వరసాగర్‌తో కలిసి నితిన్ పని చేస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ కలెక్టర్‌గా నటిస్తారనే ప్రచారం సాగుతుంది.