చిత్రం: పుష్పకవిమానం
ప్రధాన తారాగణం : ఆనంద్దేవరకొండ, గీత్ సైనీ, శాన్వీ మేఘన, హర్షవర్ధన్, వీకే నరేశ్, గిరి, కిరిటీ
రచన– దర్శకత్వం: దామోదర
సమర్పణ: విజయ్‌దేవరకొండ
నిర్మాతలు: విజయ్ దేవరకొండ, గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి
సంగీతం: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని
విడుదల: 2021 నవంబరు 12
టాలీవుడ్ సన్సేషన్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఆనంద్ దేవరకొండ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ‘దొరసాని’ చిత్రంతోహీరోగా పరిచయం అయ్యారు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తొలి సినిమా ‘దొరసాని’ అతనికి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆనంద్ నెక్ట్స్ మూవీ ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఒకే అనిపించినా.. ఆ సినిమా ఓటీటీలో రిలీజ్. అయితే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో తన సొంత ప్రొడక్షన్ హౌస్ కింగ్ ఆఫ్ ది హిల్స్ లో విజయ్ దేవరకొండ నిర్మించిన చిత్రం పుష్పకవిమానం. మరి.. ఈ పుష్పకవిమానం కథ, కథనాలు ఎలా ఉన్నాయి? ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించింది.
కథ: ఓ ప్రభుత్వ పాఠశాలలో లెక్కల ఉపాధ్యాయుడు చిట్టిలంక సుందర్ (ఆనంద్ దేవరకొండ) వైవాహిక జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఓ ఇంటివాడవుతాడు. మీనాక్షీ (గీత్ సైనీ) మెడలో తాళి కట్టి, హైదరా బాద్‌లో కొత్త కాపురం పెడతాడు. కానీ పట్టుమని పదిరోజులు గడవకుండానే చిట్టిలంక సుందర్‌ని వదిలేసి వెళ్లిపోతుంది మీనాక్షి. పెళ్లైన కొత్తలోనే భార్య లేచిపోయిందని తెలిస్తే పరువు పోయి అల్లరి పాలవుతానని ఆవేదన చెందుతూ, ఇరుగు పొరుగువారికి భార్య ఇంట్లోనే ఉందనే కలరింగ్ ఇస్తుంటాడు సుందర్. భార్యను పరిచయం చేయమని సహఉద్యోగులు ఒత్తిడి చేస్తుండటంతో మరో మార్గం లేక షార్ట్‌ఫిల్మ్ యాక్టర్ రేఖ (శాన్వీ మేఘన)ను భార్యగా యాక్ట్ చేయమని సుందర్ హైర్ చేసుకుంటాడు. అయితే మీనాక్షీ సుందర్‌ని ఎందుకు వదిలి వెళ్లిపోయింది? సుందర్, మీనాక్షి కలిసిఉన్న ఆ వారం రోజుల్లో మారి మధ్య ఏం జరిగింది? మీనాక్షిని వెతికే క్రమంలో సుందర్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? ఫైనల్‌గా సుందర్ జీవితం ఏమౌతుంది? అన్నదే కథ.
పుష్పకవిమానం కథ ఎలా ఉందంటే…
డైరెక్ట్‌గా సుందర్ పెళ్లి ఎపిసోడ్‌తోనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ పెళ్లి ఏపిసోడ్ అంతటిని ఒకే ఒక సాంగ్‌లో చూపించేస్తారు. అయితే పెళ్లి జరిగిన తర్వాత మీనాక్షి లేచి పోయిందని తన ఇరుగుపొరుగు, సహోద్యోగులను నమ్మించడానికి సుందర్ చేసే ప్రయత్నాలు నవ్విస్తాయి. ముఖ్యంగా హోటల్ నుంచి తెచ్చిన ఆహారాన్ని తన భార్య మీనాక్షి వండిందని చెప్పి తోటి టీచర్లకు పెట్టడం. అదీ హోటల్ ఫుడ్ అని వారికి తెలిసిపోవడం, ఆ తర్వాత సుందర్ భార్యను కలిసేందుకు వారు ఇంటికి రావడం వంటి సన్నివేశాలు కాస్త ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ వీటిలో కొత్తదనం లోపించినట్లు స్పష్టంగా ప్రేక్షకులకు తెలిసిపోతుంది. అలాగే సుందర్, రేఖల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా రోటిన్ స్టైల్ ఆఫ్ సీన్సే. ఫస్టాఫ్ అంతా ఇలానే సాగు..తుంది. అయితే మీనాక్షిని వార్తల్లో సుందర్ చూడటంతో అప్పటివరకు సాగుతున్న కామెడీ సినిమా ట్రాక్ క్రైమ్ టర్న్ తీసుకుంటుంది. పోలీసాఫీసర్ రంగా(సునీల్) వచ్చిన తర్వాత కూడా ఆసక్తికరంగా లేని ఈ సాగదీత కొనసాగు..తుంటుంది. ఇక సెకండాఫ్ స్టార్టింగ్ అంతా సుందర్ ఇరుక్కున కేసు గురించిన ఇన్వేష్టిగేషన్ కాకుండా..సుందర్,రంగాల మధ్య ఏదో కామెడీ చూపించాలని దర్శకుడు చేసిన ప్రయత్నం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. కేసు నుంచి బయటపడేందుకు సుందర్ కనుక్కునే క్లూస్ కూడా అంతగా ఆసక్తికరంగా, కన్విన్సింగ్‌గా ఉండవు. కానీ సెకండాఫ్‌లో సునీల్, నరేశ్‌ల మధ్య సన్నివేశాలు అప్పుడప్పుడు ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేస్తాయి. కామెడీ నుంచి క్రైమ్ టర్న్ తీసుకున్న తర్వాత కూడ కథలో ఏదో కామెడీ ఉండాలని దర్శకుడు చేసిన ప్రయత్నం కుదర్లేదు. కానీ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టు కొంతమేర ప్రేక్షకులను మెప్పిస్తుంది. కానీ ఈ ట్విస్టు గురించి ఆడియన్స్ ముందే ఓ ఊహకు రావడం జరుగుతుంది.
దర్శకుడు ఈ ట్విస్ట్ చుట్టు మరింత ఆసక్తికరమైన సన్నివేశాలను అల్లుకుని ఉంటే బాగుండేది. ఫైనల్‌గా
వైవాహిక జీవితంలో భార్యభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ సర్దుకుపోవాలనే చిన్న సందేశంతో
సినిమాను ముగించేశారు. భార్యభర్తలు బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో
దర్శకుడు కాస్త క్రైమ్ ఎలిమెంట్‌ను జోడించారు అంతే.
ఎవరు ఎలా నటించారంటే…
‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రాల్లో ఆనంద్ దేవరకొండకు హాస్య సన్నివేశాల్లో నటించే అవకాశం పెద్దగా దొరకలేదు. ఈ సినిమాలో ఆనంద్‌కు అదీ దొరకింది. కొన్ని సీన్స్‌లో ఆనంద్ కామెడీ టైమింగ్ కుదిరింది. మరికొన్ని సీన్స్‌లో ఒకే అనిపిస్తుంది. సీరియస్ అండ్ ఎమోషన్స్ సీన్స్‌లో ఆనంద్ యాక్టింగ్‌పై ఇంకాస్త మెరుగుపడాల్సి ఉంది. కెరీర్ స్టార్టింగ్నే కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఇందుకుముందు సినిమాలతో పోల్చిచూసినప్పుడు ఆనంద్ యాక్టింగ్ ఈ సినిమాలో ఫర్వా లేదు. ఇక రేఖ పాత్రలో చేసిన శాన్వీ ఫర్లేదు. ముఖ్యంగా సెకండాఫ్‌లో పోలీస్ స్టేషన్లో వచ్చే ఓ సన్నివేశం శాన్వి నటనను హైలైట్ చేస్తుంది. యాక్టింగ్‌కు పెద్దగా పెర్ఫార్మెన్స్లేని మీనాక్షి పాత్రలో ఉన్నంత పరిదిలో బాగా చేసింది. ఒక సీనియర్ యాక్టర్స్ నరేశ్, సునీల్ ఎప్పటిలాగే చేశారు. సునీల్‌కు ఎక్కువ యాక్టింగ్ చేసే స్కోప్ ఉన్నప్పటికీ.. సునీల్ యాక్టింగ్ రోటీన్లాగానే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు, సంగీతం బాగున్నాయి. కథపై దామోదర మరికొంత కసరత్తు చేసిఉంటే బాగుండేది. కథను ఇంకొంచెం ఎంగేజింగ్‌గా చెప్పి ఉండాల్సింది.
బలాలు
ప్రథమార్థంలో వచ్చే కొన్ని హాస్యసన్నివేశాలు
ప్రీ ఇంట్రవెల్ ట్విస్ట్
బలహీనతలు
–సన్నివేశాల సాగదీత
– సీరియస్ సన్నివేశాల్లో కామెడీని చొప్పించాలనే ప్రయత్నం
ఫైనల్‌గా..:దారి తప్పిన పుష్పకవిమానం