MaheshBabuSSMB29: హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లోని సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా (MaheshBabuSSMB29) ప్రతి అప్డేట్పై ఆడియన్స్ ఆసక్తికరంగా ఉన్నారు. ఫారెస్ట్ అడ్వెంచరస్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ సాగుతుంది. ఓ నిధి అన్వేషణ అనేది ఈ సినిమా ప్రధాన కంథాంశం అనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ సినిమా మొదలు కావడానికి సమయం సమీపిస్తోంది. ఈ సినిమా కథను ఆల్రెడీఫినిష్ చేశారు రచయిత విజయేంద్ర ప్రసాద్. మ్యూజిక్ వర్క్‌ను స్టార్ట్ చేశారు కీరవాణి. నటీనటుల ఎంపికను గురించి హాలీవుడ్ యాక్టింగ్ క్యాస్టింగ్ ఏజెన్సీ సీఏఏతో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవన్నీ తెలిసిన విషయాలే. తాజాగా సమాచారం ఏంటంటే….ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి కావొచ్చాయి. జూన్‌లో అంటే వేసవి పూర్తి కాగానే ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుంది. ఆల్రెడీ సెట్ వర్క్ మొదలైంది.
PrabhasKalki2898AD: కల్కిలో భైరవ…కానీ….
‘బాహుబలి’ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాల మాదిరి ఈ సినిమాకు ఎక్కువ సమయం తీసుకోకుండ వీలైనంత తొందరగా రిలీజ్ చేయాలనే ఆలోచన చేస్తున్నారు రాజమౌళి. దుర్గాఆర్ట్స్ కేఎల్‌నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈయనతో పాటుగా నిర్మాణంలో రాజమౌళి, మహేశ్‌బాబు, ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భాగస్వామ్యులుగా ఉంటారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అయితే రాజమౌళి, మహేశ్‌బాబు ఈ సినిమా కోసం పారితోషికంగా తీసుకోకుండా, సినిమా విడుదల తర్వాత వాటాలు తీసుకుంటారనే టాక్ కూడా వినిస్తోంది. అలాగే డిజిటల్ రైట్స్‌లో షేర్ అడిగే ప్లాన్‌లో ఉన్నారట మహేశ్‌బాబు. ఈ సినిమాను 2026 ఉగాదికి రిలీజ్ చేయాలని చిత్రంయూనిట్ భావిస్తోందని ఫిల్మ్‌నగర్ సమాచారం.