నాగశౌర్య కొత్త చిత్రానికి కృష్ణా వ్రిందా విహారి టైటిల్ ఫిక్సయ్యింది. శనివారం (జనవరి 22)న శౌర్య బర్త్‌డే కారణంగా కృష్ణా వ్రిందా విహారి టైటిల్, ఫస్ట్‌లుక్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇందులో షిర్లే సేతియా హీరోయిన్గా నటిస్తున్నారు. కృష్ణ పాత్రలో నాగశౌర్య, వ్రిందా పాత్రలో షిర్లే కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్ ఒక పాట మినహా పూర్తయింది. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. శంకర్ ప్రసాద్ ము ల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కావొచ్చు.