తెలుగు సినిమాలకు హిందీలో మంచి మార్కెట్ ఉందని ‘బాహుబలి’తో మరింత బాగా తెలిసింది. ‘పుష్ప: ది రైజ్’ సినిమా కలెక్షన్స్ తెలుగు సినిమాలకు హిందీ మార్కెట్లో ఉన్న క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. దీంతో తెలుగు హిట్ సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్‌కు ఇప్పుడు బాలీవుడ్లో మంచి గిరాకీ ఉంది. ఇటు హీరోలు కూడా తమ మార్కెట్‌ను పెంచుకోవడం కోసం హిందీ డబ్బింగ్ రిలీజ్ పట్ల ఆసక్తిగానే ఉన్నారు. ఇప్పటికే రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమా హిందీలో విడుదలైయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ తరుణంలో బాలకృష్ణ, మహేశ్‌బాబు ఫ్యాన్స్ కూడా తమ హీరోల సినిమాలను హిందీ డబ్బింగ్ వెర్షన్స్‌ను విడుదల చేయాలని డిమాం డ్ చేస్తున్నారు. ‘మహర్షి’ సినిమాను హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను బాలీవుడ్లో రిలీజ్ చేయాలని మహేశ్ ఫ్యాన్స్, అఖండ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను బాలీవుడ్ థియేటర్స్‌లో విడుదల చేయాలని బాలయ్య ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ హిట్ కొట్టిన ఈ రెండు సినిమాలు అక్కడ కూడా హిట్ కొట్టాయంటే చాలా మంది హీరోలు బీటౌన్ బాటపడతారు.
వుయ్ వాంట్ హిందీ వెర్షన్స్….ఫ్యాన్స్ డిమాండ్
Leave a comment
Leave a comment