ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న శ్యామ్ సింగ రాయ్ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. శనివారం మొదటి పాటను సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ సమక్షంలో విడుదల చేసి అంచనాలను పెంచేశారు. మిక్కీ జే మేయర్ అందించిన ఈ పాటను తెలుగు, తమిళ,కన్నడ, మళయాల భాషల్లో విడుదల చేశారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌లో డైరెక్టర్ రాహుల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.తాను నమ్మిన జనాల కోసం నిలబడే శ్యామ్‌లోని తత్త్వాన్ని, కోపాన్ని ప్రతిబింబించేలా ఈ పాట సాగింది. క్రిష్ణకాంత్ రాసిన ఈ పాట ఎంతో స్పూర్తినిచ్చేలా ఉంది. మిక్కీ జే మేయర్ మంచి ట్యూన్‌ను ఇచ్చారు. విశాల్ దద్లానీ, అనురాగ్ కులకర్ణి కలిసి సంయుక్తంగా ఈ పాటను అద్భుతంగా పాడేశారు.లిరికల్ వీడియోలో నాని బెంగాలీ యువకుడిలా అద్భుతమైన పాత్రలో కనిపిస్తున్నారు. సాయి పల్లవి ఆయన భార్యగా కనిపిస్తున్నారు. కోల్‌కతా నేపథ్యంలో సినిమాను తెరకెక్కించడంతో కొన్ని బెంగాలీ పదాలు కూడా వాడారు. ఈ పాట ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసేలా ఉంది.కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా.. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారుఅవార్డు గ్రహీత కృతి మహేష్, ప్రతిభా వంతుడైన యశ్ మాస్టర్ ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫర్లుగా పని చేస్తున్నారు.
రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారుభారీ వీఎఫ్ఎక్స్తో రాబోతోన్న ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది.
నాని ‘శ్యామ్ సింగ రాయ్’ ఫస్ట్ సింగిల్ ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ లిరికల్ వీడియో విడుదల
Leave a comment
Leave a comment