Vishnavtej: ఉప్పెన సినిమాతో సూపర్‌హిట్ సక్సెస్‌ను అందుకున్నారు మెగా హీరో వైష్ణవ్‌తేజ్(Vishnavtej). కానీ ఉప్పెన తర్వాత వైష్ణవ్ చేసిన ‘కొండపొలం’ బాక్సాఫీస్ వద్ద పాస్ కాలేకపోయింది. దీంతో యాక్టర్‌గా వైష్ణవ్‌తేజ్ ఇప్పుడుతప్పక నిరూపించుకోవాల్సిన పరిస్థితి. ఈ తరుణంలో వైష్ణవ్‌తేజ్ హీరోగా చేస్తున్న ఫిల్మ్ ‘రంగ రంగ వైభవంగా..’. అర్జున్‌రెడ్డి సినిమాను తీసిన సందీప్‌రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన గిరీశాయ ఈ సినిమాకు దర్శకుడు. రొమాంటిక్ ఫేమ్ కేతికా శర్మ హీరోయిన్. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు.


రంగరంగ వైభవంగా సినిమా రిలీజ్ విషయంలో వైష్ణవ్ తేజ్ చాలా టెన్షన్ పడుతున్నట్లుగా తెలుస్తోంది. రంరంగ వైభవంగా సినిమాను రిలీజ్‌ను రీసెంట్ టైమ్స్‌లో మే 27 అనుకున్నారు. కానీ ఇదే తేదీన అడివి శేష్ మేజర్, వెంకటేశ్ వరుణ్‌తేజ్‌ల ‘ఎఫ్ 3’ సినిమాలు విడుదలకు రెడీ అ య్యాయి. దీంతో వైష్ణవ్ రంగరంగ వైభవంగా సినిమాను జూలై 1కి వాయిదా వేశారు. కానీ ఇదే రోజున గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ రిలీజ్. దీంతో వైష్ణవ్‌తేజ్ రంగరంగ వైభవంగా సినిమా రిలీజ్ విషయంలో మరోసారి అయోమయంలో పడ్డారు.మరి..గోపీచంద్ సినిమాలతోనే తన సినిమాను వైష్ణవ్ రిలీజ్ చేస్తాడా? లేక మళ్లీ వాయిదా వేస్తాడా? అన్న విషయంపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.
చిరంజీవి కారణంగా వరుణ్‌తేజ్ వర్సెస్ వైష్ణవ్‌తేజ్
RRR Review: ఆర్‌ఆర్‌ఆర్ (రౌద్రం..రణం..రుధిరం) రివ్యూ
Get ready for 100% Pakka Entertainment😊#PakkaCommercial in theatres from 𝐉𝐔𝐋𝐘 𝟏𝐬𝐭, 2022.#PakkaCommercialOnJuly1st #AlluAravind @DirectorMaruthi @RaashiiKhanna_ #BunnyVas @JxBe #KarmChawla @SKNonline @UV_Creations @GA2Official pic.twitter.com/rinGI3pjo4
— Gopichand (@YoursGopichand) March 30, 2022