Nani Ante Sundaraniki: ‘అంటే..సుందరానికీ’ చిత్రం నుంచి ‘పంచెకట్టు’ పాట రిలీజైంది. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శ కత్వంలో రూపొందుతోన్న సినిమా (Nani Ante Sundaraniki) ఇది. ఈ సినిమాతో మలయాళ నటి నజ్రియా తెలుగు చిత్ర పరిశ్రమకు వస్తున్నారు. నవీన్ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ పంచెకట్టు పాటకు దర్శకుడు హసిత్ గోలీ లిరిక్స్ రాయడం విశేషం. కర్ణాటక క్లాసికల్ సింగర్ గాయని అరుణా సాయిరామ్ ఈ పాటను పాడారు. ఈ పాటలో న్యూయార్క్ లోని టైమ్ స్వైర్తో సహా అమెరికాలోని పలు ప్రదేశాల్లో నాని తిరుగుతున్నట్లుగా కనిపిస్తారు. ఈ సినిమాలో నదియ, హర్షవర్థన్, రాహుల్ రామకృష్ణు సుహాస్ కీలక పాత్రధారులు. ‘అంటే ..సుందరానికీ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాను జూన్ 10న రిలీజ్ చేయా లనుకుంటున్నారు.
Nani Dasara:దసరా టైటిల్ మాదే అంటున్న కన్నడ నటుడు, షాక్లో నాని