Nani Dasara: నాని హీరోగా నటిస్తున్న ‘దసరా’ సినిమా టైటిల్‌పై వివాదం రేగింది. కన్నడ నటుడు సతీష్ నినశాం హీరోగా చేస్తున్న సినిమాకు కూడా ‘దసరా’ అనే టైటిల్ ఉంది. అయితే తాము ముందుగా ‘దసరా’ సినిమా టైటిల్‌ను రిజిస్టర్ చేసుకున్నామని, అలాంటిది ఇప్పుడు తెలుగు నిర్మాత చెరుకూరి సుధాకర్ ఇదే టైటిల్‌తో సినిమా ఎలా చేస్తారని కన్నడ ‘దసరా’ చిత్రంయూనిట్ ప్రశ్నిస్తోంది. అలాగే నాని (Nani) ‘దసరా’ చిత్రం నిర్మాత సుధాకర్ చెరు కూరిపై కన్నడ ‘దసరా’ చిత్రం నిర్మాణ సంస్థ షర్మిలా మండ్రే ప్రొడక్షన్స్ కర్నాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్లోఫిర్యాదు చేసింది. ఇక కన్నడ ‘దసరా’ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపు కుంటుంది. మరోవైపు నాని హీరోగా చేస్తున్న ‘దసరా’ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సిని మాకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. కన్నడ ‘దసరా’కు అరవింద శాస్త్రి దర్శకుడు. మరి.. ఈ టైటిల్స్ వివాదంఫైనల్గా ఎలా ముగుస్తుందో చూడాలి.
Nani Dasara:దసరా టైటిల్ మాదే అంటున్న కన్నడ నటుడు, షాక్‌లో నాని
Leave a comment
Leave a comment