RandeepHooda: మహారాష్ట్రకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు స్వాతంత్య్ర వీర్ సవార్కర్ బయోపిక్ తెరకెక్కనుంది. వెండితెర సవార్కర్‌గా రణ్‌దీప్ హుడా (RandeepHooda) నటిస్తారు. ఈ బయోపిక్‌కు మహేశ్ మంజ్రేకర్ దర్శకుడు. మార్చి 23న ఈ బయో పిక్‌ను అధికారికంగా ప్రకటించారు. జూన్‌లో ఈ బయోపిక్ షూటింగ్ ప్రారంభం కానుంది. మహారాష్ట్రా, లండ న్, అండమాన్ నికోబార్ లొకేషన్స్‌లో బయోపిక్ షూటింగ్‌ను జరపనున్నారు. ఇక 1883 మే 28న మహా రాష్ట్రాలో జన్మించిన వినాయక్ దామోదర్ సవార్కర్ (వీర్ సవార్కర్) స్వాంతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. వీర్ సవార్కర్ రాసిన ‘ ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ బుక్‌ను బ్రిటిష్ ఇండియా బ్యాన్ చేసింది. ఇక 1910లో బ్రిటిష్ ప్రభుత్వం వీర సవార్కర్‌ను అరెస్ట్ చేసింది. అండమాన్ నీకోబార్‌లో జైలు జీవితం గడిపారు. హిందు మహాసభల్లో యాక్టివ్‌గా పాల్గొన్నారు. ఈ హిందు మహాసభల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చేలా ప్రసంగాలు చేసేవారు వీర్ సవర్కార్. చివరకు 26 ఫిబ్రవరి 1966 తుదిశ్వాస విడిచారు.
Rajamouli:ఆ RRRను మించిన కామెడీ ఫిల్మ్ మరొకటి లేదు

