సినిమా: డియర్ (DeAr Review)
ప్రధాన తారాగణం: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్యారాజేష్, రోహిణి, కాళివెంకట్, ఇళవరసు, తలైవాసల్ విజయ్
దర్శకుడు: ఆనంద్ రవిచంద్రన్
నిర్మాతలు: వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జీ పృథ్వీరాజ్
సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్
కెమెరా: జగదీష్సుందర్రామూర్తి
జానర్: రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్
నిడివి: 2 గంటల 14 నిమిషాలు
విడుదల: 12 ఏప్రిల్ 2024 (తెలుగులో విడుదల)
కథ
న్యూస్ రీడర్ అర్జున్ లైట్ స్లిపర్ (నిద్రపోయేప్పుడు చిన్న శబ్ధం వచ్చినా లైట్ స్లిపర్స్కు నిద్రపట్టదు). టాప్ న్యూస్కంపెనీలో ఉన్నతస్థాయికి ఎదగాలనుకుంటుంటాడు. మరోవైపు దీపికా రంగరావు (ఐశ్వర్యా రాజేష్)ఉద్యోగిని. దీపికా నిద్రపోతే పెద్ద శబ్దంతో గురుక వస్తుంది. ఒకరి సమస్యలను మరొకరితో చెప్పుకోకుండానే అర్జున్, దీపిలకు వివాహం చేసుకుంటారు. తాను లైట్స్లిపర్ అని దీపికకు చెబుతాడు అర్జున్. దీపికకు గురక ఉందని అర్జున్ తెలుసుకుంటాడు. అలా వివాహం తర్వాత ఒకరి సమస్యలు ఒకరికి తెలుస్తాయి. దీంతో త మ వైవాహిక జీవితం సవ్వంగా సాగాలని అర్జున్, దీపికలు ఓ స్లిపింగ్ చాట్‌ను రెడీ చేసుకుంటారు. ఈ చాట్ ప్రకారం ఒక రోజు రాత్రి ఒకరు నిద్రపోతే, మరుసటి రోజు మరోకరు నిద్రపోవాలి.
ఈ క్రమంలో వృత్తి రిత్యా మరో న్యూస్ కంపెనీలో ఉద్యోగం సాధిస్తాడు అర్జున్. కానీ ఓ రోజు సడన్‌గా అర్జున్‌కు లోక్‌సభ ఎంపీని ఇంటర్వ్యూ చేసే చాన్స్ వస్తుంది. కానీ స్లిపింగ్ చార్ట్ ప్రకారం అర్జున్‌కు నిద్ర ఉండదు. దీనికారణంగా ఎంపితో ఇంటర్వ్యూకు రెడీ అవుతున్న సమయంలోనే అర్జున్ తనకు తెలియకుండానే తానువాష్రూమ్లో నిద్రపోతాడు. దీంతో అర్జున్‌కు ఉద్యోగం పోతుంది. పైగా అర్జున్ వాష్‌రూమ్‌లో నిద్రపోయేఫోటోల వైరల్ అవుతుంది. తన కలలు, ఆశయం నాశనం కావడానికి కారణం దీపికను పెళ్లి చేసుకోడమే అని భావించిన అర్జున్ ఆమె నుంచి విడాకులు కోరతాడు. మరి..అర్జున్, దీపిక విడాకులు తీసుకున్నారా?గురక సమస్య కారణంగా కోర్టులో విడాకులు మంజూరు చేస్తారా? అర్జున్ విడాకుల అంశం అతని కుటుంబంలో ఏ విధంగా చిచ్చు పెట్టింది? ఐశ్వర్య గర్భవతి అని తెలిశాక అర్జున్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడా? అనేది సినిమాలో చూడాలి.
Maidaan Review: అజయ్‌దేవగన్ మైదాన్ రివ్యూ
విశ్లేషణ
ఒకరిసమస్యలను మరొకరు దాచిపెట్టుకుని వివాహ చేసుకున్న తర్వాత, వారి లోటుపాట్లను సరిద్దుకోవాల నుకునే జంట కథే డియర్. కథ ఏంటో సినిమా మొదలైన ఇరవై నిమిషాలకే ప్రేక్షకులు ఓ అవగాహనకు తీసుకురావడం పట్ల దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కథ అంతా తొలి ఇరవై నిమిషాల్లోనే చెప్పిన తర్వాత, ఆ నెక్ట్స్ దర్శకుడు ప్రేక్షకులు ఏం చెప్పదలచుకున్నాడా? అనే ఆసక్తి కూడా ఆడియన్స్‌లో కలుగుతుంది. తమసమస్యను సాల్వ్ చేసుకునే క్రమంలో ఓ స్లింపింగ్ చాట్‌ను రెడీ చేసుకోవడం, హీరోయిన్ ప్లాబమ్ను సాల్వ్ చేయడం కోసం హీరో ప్రయత్నం చేయడం, హీరో సమస్యను సాల్వ్ చేయడం కోసం హీరోయిన్ ప్రయత్నం చేయడం వంటి అంశాలతో కథ బాగానే సాగుతుంది. కానీ ఎప్పుడైతే హీరో జాబ్ పోతుందో అప్పట్నుంచి కథ వంకట్రింకలు తిరుగుతుంది. హీరో విడాకులు తీసుకోవాలనుకోవడంతో తొలిభాగం ముగుస్తుంది. ఇక హీరోహీరోయిన్ల మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ను డీల్ చేయడం పక్కనపెట్టి, హీరో ఫ్యామిలీ సమస్యలను ఒక్కొ క్కటిగా డీల్ పనిలో దర్శకుడు నిమగ్న మవుతాడు.
Geethanjali Malli Vachindi Review: గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా రివ్యూ
LoveGuru Movie Review: విజయ్‌ఆంటోని లవ్‌గురు మూవీ రివ్యూ
న్యూస్ ఇండస్ట్రీలో ఉన్నత స్థానంలో ఎదగడానికి గల అవకాశాలు హీరోయిన్ గురక వల్ల చేజారి పోయా యని భావించిన హీరో ఆమెకు విడాకులు ఇవ్వాలనుకుంటాడు. ఒకే..ఆ తర్వాత హీరో న్యూస్ ఇండస్ట్రీని వదిలేసి గార్డెనింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నట్లు దర్శకుడు చూపించాడు. అలాంటప్పుడు హీరోయిన్ గురక, హీరోకి ఏ విధంగా ప్రాబ్లమ్ కాదు. మొదట్లో ఎలాగూ స్లీపింగ్ చార్ట్ వేసుకున్నారు కదా.
కథ 2022లో జరుగుతుంది. దర్శకుడు మాత్రం తొలిభాగం ఓ సారి, మలిభాగంలో మరోసారి కొన్ని సంవత్సరాల తర్వాత అంటాడు. ఏంటో మరి..ఈ స్క్రీన్ ప్లే ఆడియన్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తుంది.
ఇలాంటి లోపాలు సినిమాలో ఇంకోన్ని ఉంటాయి.
నటీనటులు
అర్జున్ పాత్రలో జీవీ ప్రకాష్‌కుమార్ నటించాడు. ఎమోషనల్ సీన్స్‌లో అంతగా నటించలేకపోయాడు. కానీ ఐశ్వర్యారాజేష్ మాత్రం బాగా యాక్ట్ చేశారు. హీరోను మోటివేట్ చేసే సీన్స్‌లో ఐశ్వర్య నటన కనిపిస్తుంది.హీరోయిన్ తల్లి పాత్రలో రోహిణీకి బాగా చేశారు. తొలిభాగంలో ఐశ్వర్యతో మాట్లాడే సీన్, మలిభాగంలో హీరోతో సీన్, మలిభాగంలోనే హాస్పిటల్లో సీన్…ఇలా రోహిణీకి మంచి నటన చూపించారు. హీరో అన్న య్య పాత్ర చరణ్‌గా కాళివెంకట్ ఎప్పటిలానే రోటీన్‌గా చేశారు. హీరోయిన్ తండ్రి రంగారావు పాత్రలో ఇళవరసు ఒకే, హీరో తండ్రి రామ్మోహన్ పాత్రలో తలైవాసల్ విజయ్ వారి పాత్రల మేరకు మెప్పించారు.
మ్యూజిక్‌లో తమిళమ్యూజిక్ వినిపించింది. సెకండాఫ్‌లో ఓ అనవసరమైన బార్ సాంగ్ ఉంటుంది. కెమెరా వర్క్ ఒకే. ఎడిటింగ్ ఇంకాస్త చేయవచ్చు. ముఖ్యంగా సెకండాఫ్‌లో. తెలుగు అనువాద విలువలు బాగో లేవు. కోర్టు గోడలపై అర్థంపర్థం లేని వాక్యాలు, స్క్రీన్‌పై బ్రోకెన్ తెలుగు, వైజాగ్ నుంచి అరకు…తరచూ ఫ్లైట్ …ఇలా తెలుగు అనువాద విలువలు ఆడియన్స్‌కు చికాకు తెప్పిస్తాయి.