Ajith GoodBadUgly: తమిళ స్టార్ హీరో అజిత్ లేటెస్ట్ మూవీ ఖరారైంది. ఈ యాక్షన్ ఫిల్మ్‌కు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Ajith GoodBadUgly) టైటిల్ పెట్టారు. ఇటీవల తమిళంలో ‘మార్క్ ఆంటోనీ’ సినిమా తీసిన అదిత్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు ఈ సినిమాను నిర్మిస్తారు. తమిళంలోమైత్రీమూవీ మేకర్స్ నిర్మించనున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. అలాగే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్మ్యూజిక్ డైరెక్టర్. జూన్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టాలనుకుంటున్నారు. 2025 సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం అజిత్ ‘విడముయార్చి’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాను అజిత్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. ఇక ‘విడముయార్చి’ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాకముందే, అజిత్ నెక్ట్స్ ఫిల్మ్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం రిలీజ్ డేట్ రావడం విశేషం. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం అజిత్ కెరీర్లో 63వ సినిమా అన్న సంగతి తెలిసిందే.
2025 సంక్రాంతి సమాయానికి చిరంజీవి ‘విశ్వంభర’, వెంకటేష్- అనిల్‌రావిపూడి కాంబినేషన్లోని సినిమా, ప్రభాస్ ‘రాజా సాబ్’, ‘శతమానంభవతి 2’, నాగార్జున ‘బంగార్రాజు 3’ సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. కానీ అజిత్ కూడా ఈ చిత్రాలతో పాటు వస్తుంది. అయినా తెలుగు సినిమాలు సంక్రాంతికి చాలానే ఉన్నా అజిత్ సినిమా తెలుగులో సంక్రాంతికి విడుదలైన సందర్భాలు ఉన్నాయి. అజిత్ 2019లో చేసిన విశ్వాసం, 2023లోని తునివు చిత్రాలు ఆ సందర్భాల్లో తెలుగు హీరోల సినిమాలతో పాటుగా సంక్రాంతికి విడుదల అయ్యాయి. విశ్వాసం మంచి హిట్‌గా నిలవగా, తునివు పర్వాలేదనిపించింది.