Keerthy Suresh: అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ ఓ సినిమా చేస్తారనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తూనే ఉంది. ఈ తరుణం ఇప్పుడు వచ్చిందట. అట్లీ భార్య ప్రియాంకా అట్లీ ఇటీవల ఓ వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. అట్లీ నెక్ట్స్ సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్న వీడియో అది. ఈ వీడియో బయటకు రాగానే అల్లు అర్జున్‌తో అట్లీ చేయబోయే సినిమాను గురించే ఈ డిస్కషన్లు అనే టాక్ తెరపైకి వచ్చింది. ఆల్మోస్ట్ఈ సినిమా ప్రాజెక్ట్ కన్ఫార్మ్ అయ్యిందని, అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న అధికారిక ప్రకటన వచ్చే చాన్సెస్ ఉన్నాయన్నది ఫిల్మ్‌నగర్ సమాచారం. తాజాగా ఈ సినిమాను గురించిన మరో గ్యాసిప్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ వార్తలను సులభం కొట్టిపారేయలేం. ఎందుకుంటే అట్లీ హిందీలో నిర్మిస్తున్న వరుణ్‌ధావన్ ‘బేబీజాన్’ సినిమాలో కీర్తీ సురేష్ ఓహీరోయిన్గా నటిస్తున్నారు. సో…ఈ సినిమాలో కూడా కీర్తీకి అట్లీ చాన్స్ ఇచ్చారనే టాక్ టాలీవుడ్లో వినిపిస్తోంది.
Keerthy Suresh: అల్లు అర్జున్‌తో కీర్తీసురేష్?
అల్లు అర్జున్ కొత్త సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది.
Leave a comment
Leave a comment