Nani: బర్త్ డే రోజు (ఫిబ్రవరి 24) హీరో నాని(Nani) డబుల్ ట్రీట్ ఇచ్చారు. నాని లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) గ్లింప్స్ వీడియోను విడుదలైంది. ‘అంటే…సుందరానికీ..’ తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రూపొందుతున్న మరో సినిమా ఇది. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తనకు ఎన్ని ఇబ్బందులు ఎదరైనా, వాటిని ఓ పేపర్‌పై రాసుకుని ..పద్దతి ప్రకవారం శనివారం వారిపై రివేంజ్ తీర్చుకునే సూర్య పాత్రలో నాని నటిస్తున్నారు ‘సరిపోదా శనివారం’ సినిమాలో. ఎస్జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్రధారి. ఎస్జే సూర్యఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఆగస్టు 29న ఈ చిత్రం విడుదల కానుంది.
అలాగే నాని హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా అప్డేట్ కూడా వచ్చింది. డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
వీటితో పాటుగా ‘బలగం’ ఫేమ్ వేణు ఎల్దండి డైరెక్షన్లో నాని ‘ఎల్లమ్మ’ సినిమా చేయనున్నారు. స్టోరీలైన్ విన్నారు…కానీ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. అన్నీ కుదిరితే…ఈ సినిమా ఉంటుంది. ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తారు. ఇంతవరకు బాగానే ఉంది…కానీ ‘హిట్’ ఫ్రాంచైజీలోని ‘హిట్ 3’ సినిమాకు నాని కమిటైయ్యారు. నాని కూడా ఈ చిత్రానికి ఓ నిర్మాత. కట్ చేస్తే…ఈ సినిమాను గురించిన అప్డేట్ మాత్రం నాని బర్త్ డే రోజున రాలేదు. ‘హిట్’ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను ఇటీవల వెంకటేష్‌తో ‘సైంధవ్’ సినిమా తీశాడు. ఈ సినిమా డిజాస్టర్. దీంతో ‘హిట్ 3’ సినిమాను నాని కాస్త వెనక్కి జరిపినట్లుగా తెలుస్తోంది.