Nani: ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు శ్రీకాంత్ ఓదెల. ఇందులో నాని హీరో. తొలి చిత్రం ‘దసరా’తోనే వందకోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించారు శ్రీకాంత్ ఓదెల. దీంతో శ్రీకాంత్ తర్వాతి చిత్రం కూడా నానితోనే ఉండనుంది. ‘దసరా’ సినిమాలనే ఇది కూడా పీరియాడికల్ ఫిల్మ్ అని తెలుస్తోంది. చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవిని పొగుడుతూ, ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు శ్రీకాంత్ ఓదెల. అలాగే చిరంజీవి ‘ఖైదీ’ పోస్టర్‌ను కూడా షేర్ చేశాడు. నేను చిరంజీవిగారి ఖైదీ పోస్టర్‌నే ఎందుకు షేర్ చేశాను అన్నది తన తర్వాతి సినిమాలో చూపిస్తానన్నాడు.
చిరంజీవి ‘ఖైదీ’ సినిమా 1983లో విడుదలైంది. సో..తన తర్వాతి చిత్రం కూడా ‘దసరా’ మాదిరి పీరియాడికల్ ఫిల్మ్ అనే తెలుస్తోంది. ప్రస్తుతం వివేక్ ఆత్రేయతో నాని ‘సరిపోదా శనివారం’ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెలతో నాని సినిమా ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.