ప్యాన్ ఇండియన్ మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఓం రౌత్ డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతీసనన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపిస్తారు. అయితే రావణుడి పెద్ద కుమారుడైన ఇంద్రజిత్ పాత్రలో ఎవరు కనిపిస్తారనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. హిందీ యాక్టర్ వత్సల్ శేత్ ‘ఆదిపురుష్’ చిత్రంలో ఇంద్రజిత్ క్యారెక్టర్ చేశాడు. ఆల్రెడీ తన వంతు షూటింగ్ కూడా పూర్తయింది. ‘ఆది పురుష్’ చిత్రంలోని ఈ ఇంద్రజిత్ క్యారెక్టర్‌కు ముందుగా యంగ్ హీరో సిద్దార్థ్ శుక్లాను అనుకుని ఆడిషన్స్ చేశారు. కానీ ఇటీవల సిద్దార్థ్ శుక్లా మరణించడంతో వత్సల్‌కు చాన్స్ దక్కింది. ‘జయ హో,‘హాస్టల్’, ‘మలాంగ్’ వంటి సినిమాల్లో నటించిన వత్సల్ బుల్లితెరపై కూడా ఫేమసే. హిందీలో చాలా షోలు చేశాడు. ఇక 103 రోజులు షూటింగ్ జరుపుకున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరగాల్సి ఉంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయాలను కుంటున్నారు.
ఇతడే ఇంద్రజిత్
Leave a comment
Leave a comment