రవి తేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరో హీరోయిన్లుగా దర్శకుడు రమేష్ వర్మతెరకెక్కించిన చిత్రం ఖిలాడి. ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మించారు. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైంది. ఖిలాడి సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న విడుదల కానుంది. నవంబరు 11న ఈ ఖిలాడి విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్అం దిస్తున్నా రు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా.. అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఖిలాడి సినిమాను తొలుత 2021 మే 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా, లాక్డౌన్, థియేటర్స్ మూసివేత వంటి కారణాల చేత ఖిలాడి సినిమాను ఫిబ్రవరి 11కు వాయిదా వేశారు. ఇక ఇది వరకు రవితేజ, రమేశ్‌వర్మ కాంబినేషన్లో వచ్చిన వీర సినిమాకు అంతగా ఆడలేదు.
ఖిలాడి రిలీజ్ తేదీ ఖరారు. ఎప్పుడో తెలుసా!
Leave a comment
Leave a comment