Sundeep Kishan: మైథలాజి టచ్ ఉన్న సినిమాలను ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు భలేగా ఆదరిస్తున్నారు. ఇటీవల ఓ బంపర్ హిట్ కొట్టిన ‘విరూపాక్ష’, ‘కాంతార’, ‘హనుమాన్’ సినిమాలే ఇందుకు నిదర్శనం. తాజా గా ఈ కోవలో వస్తున్న మరో చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona). ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్కక్షణం’ వంటి సిని మాలను తీసిన వీఐ ఆనంద్ ఈ సినిమాకు దర్శకుడు. సందీప్‌కిషన్ (Sundeep Kishan) హీరోగా నటించగా, కావ్యాథాపర్ మెయిన్ హీరోయిన్ రోల్ చేశారు. వర్ష బొల్లమ్మ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కూడా ఉండటం ఈ సినిమాకు బాగా ఫ్లస్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ లవర్స్ డే సందీప్ కిషన్‌కు ఓ బ్యాడ్ డేగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
తెలుగులో హిట్ సాధించిన పవన్‌కళ్యాణ్ ‘తొలిప్రేమ’, సిద్దార్థ్ ‘ఓయ్’, దుల్కర్సల్మాన్–మృణాల్ఠాకూర్ల ‘సీతారామం’, సూర్య ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమాలతో పాటుగా మరికొన్ని ప్రేమకథా చిత్రాలు లవర్స్ డే సందర్భంగా రీ రిలీజ్ అవు తున్నాయి. ఇది కచ్చితంగా ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రంయూనిట్ ఊహించని ఇబ్బంది. ఈ ఇబ్బందిని కాస్త ఓవర్‌కమ్ చేసేందుకు రిలీజ్‌కు రెండు రోజులు ముందుగానే..అంటే ఫిబ్రవరి 14నే ప్రీమియర్స్ వేయాలని చిత్రంయూనిట్ భావిస్తోంది. ‘ఊరి పేరు భైరవకోన’ ఫాంటసీ మిస్టిరీయస్ థ్రిల్లర్. మిగతావి లవబుల్ సినిమాలు. కొత్త సినిమా కన్నా కూడా ప్రేమికులు ప్రేమకథా చిత్రాలను థియేటర్స్‌లో చూసేందుకే మొగ్గు చూపవచ్చు. గతంలో సందీప్‌కిషన్, వీఐ ఆనంద్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘టైగర్’ హిట్‌కు నోచుకోలేదు. మరి..ఈ హార్డిల్స్‌ను దాటుకుని ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా విజయం సాధిస్తుందో లేదో చూడాలి.