Vijaydevarakonda: ‘సరైనోడు’ వంటి హిట్ఫిల్మ్ తర్వాత బోయపాటి గీతాఆర్ట్స్‌లో మరో సినిమా చేయనున్నారు. హీరోని ప్రకటించలేదు. దీంతో అల్లు అర్జున్, సూర్య, బాలకృష్ణ వంటివార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా విజయ్‌దేవరకొండ పేరు వినిపిస్తోంది. గీతాఆర్ట్స్ ఉప సంస్థ జీఏ2లో విజయ్‌దేవరకొండ ఆల్రెడీ ‘గీతగోవిందం’ సినిమా చేశాడు. పరశురామ్ దర్శకుడు. విజయ్‌దేవరకొండ, రష్మికా మందన్నా తొలిసారిజంటగా నటించిన ఈ చిత్రం వందకోట్ల రూపాయలగ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. దీంతో గీతాసంస్థలో విజయ్‌దేవరకొండ, పరశురామ్ కాంబో రిపీట్‌కు రంగం సిద్ధమైంది.
కానీ పరశురామ్‌కు ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. మహేశ్‌బాబుతో ‘సర్కారువారిపాట’ సినిమాతీసిన తర్వాత పరశురామ్ గీతాసంస్థలోనే సినిమా చేయాల్సింది. అంతా ఒకే అనుకున్న తరుణంలో ఆ ప్రాజెక్ట్ ‘దిల్’ రాజు కాంపౌండ్‌కు వెళ్లింది. అదే ఇప్పుడు విజయ్‌దేవరకొండ, పరశురామ్ కాంబోలో రూపొందుతున్న ‘ఫ్యామిలీస్టార్’. ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల అవుతుంది. ఇలా గీతాసంస్థలో విజయ్చేయాల్సిన సినిమా కాస్త ఆలస్యమైంది. దీంతో ఇప్పుడు బోయపాటి శ్రీను, విజయ్‌దేవరకొండ కాంబో తెరపైకి వచ్చింది. మరి..ఈ మాస్ దర్శకుడితో విజయ్ సినిమా చేస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ.