Tripti Dimri: రణ్‌బీర్‌కపూర్ ‘యానిమల్’ సినిమాలో జోయా పాత్రలో నటించి, ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీ అయిపోయారు త్రీప్తీ దిమ్రీ (Tripti Dimri). గతంలో ఐదారు సినిమాలు చేసిన త్రీప్తికి ఆదరణ దక్కలేదు. కానీఒక్క ‘యానిమల్’ సినిమాతో త్రీప్తి దిమ్రీ ఆల్మోస్ట్ స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్నారు. ‘యానిమల్’ సినిమాలో హీరోయిన్గా నటించిన రష్మికా మందన్నా కంటే ఎక్కువగా త్రిప్తీ గురించే ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు. దీంతో త్రీప్తీ క్రేజ్ తగ్గట్లు ఆఫర్స్ వస్తున్నాయి. కానీ త్రిప్తీ కొత్తగా ఆలోచించింది.వెంటనే మరో రొమాంటిక్ రోల్‌కు ఒప్పుకోకుండా ఓ హారర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్సక్సెస్ఫుల్ హారర్ కామెడీ ఫ్రాంచైజీ ‘భూల్ భూలయ్యా’(Bhool Bhulaiyaa 3) థర్డ్ పార్టు ‘భూల్ భూలయ్యా 3’లో హీరోయిన్గా నటిస్తున్నారు త్రిప్తీ. కార్తీక్ ఆర్యన్(Kartik Aaryan) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో విద్యాబాలన్ మరో లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో త్రిప్తీ పాత్ర ఆడియన్స్‌ను భయ పెట్టేలా ఉంటుందట. అనీస్ బాజ్మీ డైరెక్షన్లోభూషణ్ కుమార్, క్రిషణ్‌కుమార్ నిర్మిస్తున్న ‘భూల్‌భూలయ్యా 3’ చిత్రం ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది.
NTR Devara: దేవర ముందు ఎన్నో అడ్డంకులు