శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా అజయ్‌భూపతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మహాసముద్రం’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్‌సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ఈ సినిమా సెకండ్ ట్రైలర్‌ను అతిథిగా వచ్చిన హీరో కార్తికేయ విడుదల చేశారు. అనంతరం…
కార్తికేయ మాట్లాడుతూ – ‘‘అజయ్‌భూపతి నాతో ఆర్‌ఎక్స్ 100 సినిమా తీయడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. అలాంటి అజయ్‌భూపతి రెండో సినిమా కోసం కష్టపడుతున్నారని తెలిసి బాధ పడ్డాను. ఈ సినిమాను ఒకే చేసిన శర్వానంద్‌కు థ్యాంక్స్. ఆర్‌ఎక్స్ 100 సినిమా షూటింగ్ సమయంలోనే మహా సముద్రం సినిమా స్టోరీలైన్ విన్నాను. ఈ సినిమాలో భాగం కాలేకపోయినందుకు ఇప్పుడు బాధగా ఉంది. శర్వాబాగా చేస్తారు. సిద్దార్థ్‌గారి ఏజ్ సీక్రెట్ ఏంటో అర్థం కావడం లేదు’’ అని అన్నారు.
శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘సిద్దార్థ్ చెబుతూ మహాసముద్రం చిత్రంలో నేనే హీరో అన్నాడు. నెనో పెద్ద స్టార్‌నన్నాడు. అది అతని గొప్పదనం. నిజానికి…సిద్దార్థ్ ఎప్పుడో సూపర్ స్టార్ అయ్యాడు. తొమ్మిదిమంది వ్యక్తుల కథే ‘మహాసముద్రం’ సినిమా. కథే హీరో. ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో సక్సెస్ కొట్టినా అజయ్ భూపతి తర్వాతి సినిమాకు తన తర్వాతి సినిమాకు హీరోలు సెట్ కావడం లేదని రావురమేష్‌గారు ఓ షూట్‌లో చెప్పారు. అజయ్‌భూపతి చెప్పిన కథ విన్నాను. నచ్చింది. వెంటనే అనిల్‌సుంకరగారికి కథ వినిపించాము. మూడే రోజుల్లో ప్రాజెక్ట్ ఒకే అయిపోయింది. జగపతిబాబుగారితోయాక్ట్ చేయాలన్న నా కోరిక ‘మహాసముద్రం’తో తీరింది. ఈ సినిమాలో మహా క్యారెక్టర్‌లో అదితీ, స్మిత పాత్రలో అను బాగా చేశారు. ‘మహాసముద్రం’ సినిమా తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది. నేను హీరోగా నటించిన ‘ఎక్స్‌ప్రెస్‌రాజా’, ‘శతమానంభవతి’, ‘మహానుభావుడు’ చిత్రాలు పండక్కే వచ్చాయి. హిట్స్ కొట్టాను. ఇప్పుడు ఈ దసరాకు మహాసముద్రం వస్తుంది. హిట్ కొడతాను’’ అని అన్నారు.
సిద్ధార్థ్ మాట్లాడుతూ – ‘‘మహాసముద్రం సినిమా అందరు నా కమ్‌బ్యాక్ మూవీ అంటున్నారు. కానీ ఇది రీ లాంచ్ మూవీ. ఎదుకంటే ఇందులో కొత్త సిద్ధార్థ్‌ను చూస్తారు. నన్ను స్టార్‌ని చేసిన తెలుగు ప్రేక్షకులను ఇక విడిచి వెళ్లను. నాకు వెలుగునిచ్చే సూర్యలు తెలుగు ప్రేక్షకులే. ఇది మల్టీస్టారర్ మూవీ కాదు. ‘మహా సముద్రం’ సినిమా హీరో శర్వాదే. శర్వా వల్లే ఈ సినిమా ఈ స్థాయిలో ఉంది. బడ్జెట్ కుదరింది. శర్వా ఓ స్టార్. ఈ సినిమా వల్ల నేను ఏం సాధించనని చెబుతానంటే శర్వా వంటి ఓ మంచి స్నేహితుడిని సంపాదించుకున్నాను. జగపతిబాబు, రావురమేష్ వంటి స్టార్ల నుంచి ఎన్నో విషయాలు మేం నేర్చుకున్నాం. అదితీ, అను బాగా నటించారు. కోవిడ్ వచ్చిన ‘ఆర్‌ఎక్స్ 100’తో మొదలైన అజయ్‌భూపతి వేగం ఇంకా తగ్గలేదు. మహాసముద్రం బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు.
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాకు సిద్దార్థ్, శర్వా, అను, అదితి నాలుగు ఫిల్లర్లు. జగపతిబాబు, రావురమేష్ రూప్. మహాసముద్రం కచ్చితంగా హిట్ సాధిస్తుంది. థియేటర్స్‌లేనప్పుడు సినిమాలు ఎక్కడ విడుదలైన ఒకే. కానీ థియేటర్స్ ఉన్నప్పుడు సినిమాలు కచ్చితంగా థియేటర్స్‌లోనే విడుదల కావాలి. అది మన బాధ్యత’’ అని అన్నారు.
హీరోయిన్ అదితీరావ్ హైదరీ మాట్లాడుతూ –‘‘నేను తెలుగు అమ్మాయినే కానీ నాకు తెలుగు రాదు. నేర్చుకుంటున్నాను. ఇందులో మహా పాత్ర చేశాను. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు.
హీరోయిన్ అనూఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ–‘‘శర్వా, సిద్ధార్థ్ అమేజింగ్ కో స్టార్స్. ఇందులో స్మిత పాత్ర పోషించాను. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో దర్శకలు మెహర్‌రమేష్, స్వరూప్, విజయ్ కనకమేడల, రవి, నిర్మాతలు సునీల్‌నారంగ్, జెమిని కిరణ్‌లతో పాటు చిత్రయూనిట్ పాల్గొని సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు.