స్మార్ట్ సెల్‌ఫోన్స్ పుణ్యమా అని ప్రపంచమే అరచేతిలో ఒదిగిన ఈ రోజుల్లో సినిమా స్టార్స్‌కు వీక్షకులను చేరుకో వడం చాలా సులువైపోయింది. లాక్డౌన్ కారణంగా వినోదపు ఇంటిలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా చోట దక్కించుకున్నాయన్న మాట వాస్తవం. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్టార్స్ టాక్ షోలు చేస్తున్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా బాలకృష్ణ జాయిన్ అయ్యారు. ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం బాలయ్య ఓ టాక్ షో రెడీ అవుతుంది. బాలయ్యతో ‘గౌతమీపుత్రశాతకర్ణి’, ‘ఎన్టీఆర్: కథానాయకుడు’, ‘ఎన్టీఆర్:మహా నాయకుడు’ వంటి సినిమాలను తీసిన క్రిష్ ఈ టాక్ షోను భాగమయ్యారట. మరి..బాలయ్య టాక్ షో అంటే ఆయన మార్క్ స్టైల్ టాకింగ్, శైలి కచ్చితంగా వినోదాన్ని అందిస్తాయి. కానీ ‘చిరంజీవి, విజయ్‌దేవరకొండ, అల్లు అర్జున్’ వంటి స్టార్స్‌తో సమంత ‘ఆహా’లో చేసిన టాక్ షో ‘సామ్ జామ్’ అంత ఆదరణకు నోచుకోలేదు. మరి..ఓటీటీలో బాలయ్య టాక్ షో వర్కౌట్ అవుతుందా? ఎమో మరి. అయితే ఈ టాక్ షో అనౌన్స్మెంట్ ఈ దసరాకే ఉంటుందని తెలిసింది.
సమంతలకు కలిసి రానిది బాలయ్యకు కలిసొస్తుందా?
Leave a comment
Leave a comment