టాప్ హీరోయిన్ సమంత ప్రజెంట్ చేస్తోన్న తాజా చిత్రం ‘యశోద’. హరి అండ్ హరిష్ దర్శకద్వయం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ యశోద చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రంలో ప్రియుడి చేతిలో మోసపోయిన నర్స్ యశోద పాత్రలో కనిపించనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో గర్భవతి పాత్రలో కనిపిస్తారు సమంత. ఇక ప్రియుడి చేతిలో మోసపోయి ఆరు నెలల గర్భవతిగా ఉన్న సమంతకు సహాయం చేసే పాత్రలో వరలక్ష్మీ శరత్‌కుమార్ కనిపిస్తారు. మార్చి కల్లా ఈ సినిమాను పూర్తి చేసి వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నా రని తెలిసింది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయను న్నారు.
ప్రియుడి చేతిలో మోసపోయిన సమంత?
Leave a comment
Leave a comment