ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రౌద్రం..రణం..రుధిరం’. ఇప్ప టికే నాలుగుసార్లు (2019 జూలై 30, 2020 జనవరి 8, 2021 అక్టోబరు 13, 2022 జనవరి 7) అధికారి కంగా వాయిదా పడిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీలు శుక్రవారం వెల్లడైయ్యాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రా న్ని ఈ ఏడాది మార్చి 18న లేదా ఏప్రిల్ 28న విడుదల చేస్తామని చిత్రబృందం శుక్రవారం అధికారికంగా ప్రకటిం చింది. ‘‘దేశంలో పరిస్థితులు అన్నీ చక్కబడి, దేశవ్యాప్తంగా థియేటర్స్‌లో వందశాతం సీటింగ్ ఆక్యూపెన్సీ ఉన్నట్లయితే మా సినిమాను మార్చి 18న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేకపోతే ఏప్రిల్ 28న విడుదల చేస్తాం’’ అని ఆర్‌ఆర్‌ఆర్ చిత్రబృందం ఈ నోట్‌ను విడుదల చేసింది. ఇక ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటించారు.
ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్, రామ్‌చరణ్ సరసన ఆలియాభట్ కథానాయికలుగా కనిపిస్తారు. అజయ్ దేవగన్, రే స్టీవెన్‌సన్, అలిసన్‌డూడీ, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని కీలక పాత్రలు చేసిన ఈ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు.
ఆర్‌ఆర్‌ఆర్ రిలీజ్ డేట్స్ ఇవే


Leave a comment
Leave a comment