బాలీవుడ్ సూపర్‌స్టార్ హీరో హృతిక్‌రోషన్ తల్లి పింకీ రోషన్ వర్కౌట్స్ చేస్తోన్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను హృతిక్‌రోషన్ షేర్ చేశారు. మా అమ్మ 68 సంవత్సరాల వయసులోనూ కాంప్రమైజ్ కాకుండా వర్కౌట్స్ చేస్తున్నారు. తన నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందుతున్నాను. నిజానికి మా అమ్మగారు తన 58 సంవత్సరాల వయసులోనే వర్కౌట్స్ స్టార్ట్ చేశారు. ఇట్స్ నెవర్ టు లేట్. వర్కౌట్స్ విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందని భావించే తల్లిదండ్రులకు చెబుతున్నాను. మీ పిల్లలకోసమైనా వర్కౌట్స్ చేయండి’’ అని పేర్కొన్నారు హృతిక్‌రోషన్.
ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం తమిళం హిట్ ‘విక్రమ్ వేదా’ హిందీ రీమేక్, ‘ఫైటర్’ సినిమాలతో బిజీగా ఉన్నారు హృతిక్ రోషన్. క్రిష్ 4ను అనౌన్స్ చేసి మూడు సంవత్సరలు గడిచినప్పటికీని ఈ సినిమాపై మరో అప్డేట్ ఇవ్వలేదు హృతిక్.