జీవితంలో స్థిరపడిన తర్వాత ఓ అందమైన ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. టాప్ హీరోలతో వరుస సినిమాలకు సైన్ చేస్తోన్న హీరోయిన్ పూజాహెగ్డే కెరీర్లో మంచి జోష్లో ఉన్నారు. ఈ హ్యాపీనెస్లోనే పూజాహెగ్డే ఓ ఇంటిదైంది. ముంబైలో ఓ సొంత ఇల్లు కట్టుకుంది హీరోయిన్ పూజాహెగ్డే. ఈ ఇంటికి సంబంధించిన అన్నీ పనులు ఏడాది క్రితమే పూర్తయ్యాయి. అప్పట్లో తాను కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసిన ఫోటోను పూజా తాజాగా షేర్ చేశారు. ‘‘నిన్ను నువ్వు నమ్ముకుంటూ కష్టపడితే విధే నీకు సహాయం చేస్తుంది’’ అని పూజాహెగ్డే పేర్కొన్నారు.