ఓటీటీలో విడుదలైన ‘దృశ్యం 2’ సక్సెస్‌మీట్‌లో ‘ఎఫ్ 3’ సినిమాకు సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు వెంకటేశ్. దర్శకుడు అనిల్‌రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ మరో హీరో. కానీ ‘రౌద్రం..రణం..రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్) ఎఫెక్ట్‌తో ఈ సినిమా విడుదల సంక్రాంతి నుంచి ఫిబ్రవరికి వాయిదా పడింది. అక్కడి నుంచి ఏప్రిల్ 29కి, కొన్ని రోజుల ముందు ఏప్రిల్ 28కి ఎఫ్ 3 సినిమా రిలీజ్ మారుతూ వస్తోంది.. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా కొత్త విడుదల తేదీలు ఖరారైయ్యాయి. కరోనా పరిస్థితులు కుదుట పడి, థియేటర్స్‌లో వందశాతం ఆక్యూపెన్సీ ఉంటే మార్చి 18న లేదా ఏప్రిల్ 28న ‘ఆర్‌ఆర్‌ఆర్’ను విడుదల చేస్తామని రాజమౌళి అంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆర్‌ఆర్‌ఆర్ ఆశలు మార్చి 18కి అయితే రావని తెలుస్తోంది. అప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ఏప్రిల్ 28నే వస్తుంది. అలా ‘ఎఫ్ 3’ చిత్రం రిలీజ్ తప్పక వాయిదా పడుతుంది. ఇక వరుణ్‌తేజ్ ‘గని’ విషయానికి వస్తే ఈ పరిస్థితి మరింత దారుణం. ‘గని’ సినిమా మార్చి 18న విడుదల అయ్యేందుకు రెడీ అయ్యింది. ఒకవేళ ఆర్‌ఆర్‌ఆర్ మార్చి 18కి వస్తే ‘గని’ చిత్రం వాయిదా పడక తప్పదు. ఇలా ఆర్‌ఆర్‌ఆర్ ప్రకటించిన రెండు విడుదల తేదీలతో ఇబ్బంది పడేది వరుణ్‌తేజే.
ఆర్‌ఆర్‌ఆర్ విడుదల తేదీలు ఖరారు…అయోమయంలో మెగాహీరో
Leave a comment
Leave a comment