‘బాహుబలి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘రౌద్రం.. రణం.. రుధిరం’(ఆర్‌ఆర్‌ఆర్). 1920 బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన ఓలివియా మోరిస్, రామ్‌చరణ్ సరసన ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్‌చరణ్ పాత్రలకు సంబంధించిన వీడియో టీజర్‌లను విడుదల చేసింది చిత్రబృందం. వీటికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ మేకింగ్ వీడియోను ‘రోర్ ఆఫ్ ఆర్‌ఆర్‌ఆర్’ పేరుతో జూలై 15(గురువారం)న విడుదల చేశారు.ఈ వీడియోకు ఆడి యన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా టాకీ పార్టు పూర్తయింది. మరో రెండు పాటలను చిత్రీకరిస్తే సినిమా షూటింగ్ అంతా పూర్తవుతుంది. రామ్‌చరణ్, ఆలియాభట్ కాంబినేషన్‌లో ఓ సాంగ్, ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రయూనిట్ అందరు కలిసి కాలుకదిపే ఇంకో సాంగ్‌ను షూట్ చేస్తే ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టినట్లే. ఈ సాంగ్స్ చిత్రీకరణ యూరప్‌లో జరపాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ఇటీవలే రాజమౌళి అండ్ టీమ్ లొకేషన్ సెర్చ్‌ని కూడా కంప్లీట్ చేసి వచ్చారు. ఈ నెలాఖర్లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సాంగ్ షూట్ జరుగుతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రంలో అజయ్ దేవగన్, శ్రియ, అలిసన్ డూడీ, రే స్టీవెన్ సన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తం పద్నాలు (విదేశీ భాషలతో సహా) భాషల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాను ఈ ఏడాది అక్టోబరు 13న విడుదల చేయాల నుకుంటున్నారు.