ఆనంద్ దేవరకొండ, మానసా రాధాకృష్ణన్ జంటగా రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘హైవే’. ‘ఏ నర్వ్ వ్రాకింగ్ రైడ్ స్టోరీ’ సినిమా రెగ్యులర్ షూటింగ్ బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. శ్రీ ఐశ్యర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై వెంకట్ తలారి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కేవీ గుహన్ దర్శకుడు. ‘‘రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగే ఒక సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హైవే’’ అన్నారు కేవీ గుహన్. ఈ చిత్రానికి సైమన్ కె కింగ్ సంగీతం అందిస్తున్నారు.