రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న(RC15 Latest update detailes inside) సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ రాజమండ్రిలో జరుగుతోంది. రామ్‌చరణ్‌పై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని గమనించినచిత్రంయూనిట్ ‘‘కథ రిత్యా రామ్‌చరణ్ తాజా చిత్రం పబ్లిక్ లొకేషన్స్‌లో ప్రజలు ఎక్కువగా ఉండే లొకేషన్స్లోచిత్రీకరించడం జరగుతోంది. అయితే ఈ షూట్స్‌కు సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలను ఎవరూ వైరల్చేయవద్దని, షూటింగ్ కంటెంట్‌ను ఎవరూ తమ ఫోన్స్‌లో షూట్ చేయవద్దు. ఒకవేళ కంటెంట్‌ను షూట్‌ను చేసినట్లయితే చట్టరిత్యా చర్యలు తీసుకుంటాము’’ అని చిత్రబృందం పేర్కొంది.
ఇక రామ్ చరణ్ కెరీర్లో 15వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కియారా అద్వానీ హీరోయిన్గా నటిసున్నారు. అయితే ఈ చిత్రంలో చరణ్ డ్యూయోల్ రోల్స్‌లో కనిపిస్తారని, ప్రస్తుతం ప్లాష్‌బ్యాక్ సీన్స్‌కు
సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. శ్రీకాంత్, సునీల్, నవీన్‌చంద్ర, అంజలి కీలక
పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే
ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.