ప్రముఖ సంగీత దర్శకుడు బప్పిలహరి (69) (https://en.wikipedia.org/wiki/Bappi_Lahiri) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రవైటు హాస్పిటల్లో కన్నుమూశారు. 1952 నవంబరు 27న బెంగాల్‌లోని జల్పాయ్గుడిలో బప్పిలహరి జన్మించారు. బ్రహ్మాణ కుటుంబంలో సింగర్స్ అండ్ మ్యూజిక్ కంపోజర్స్ అయిన అపరేష్ లహరి, బన్సూరి లహరిలకు జన్మించాడు బప్పిలహరి. అయితే ఇటీవల బప్పిలహరి కరోనా బారిన పడ్డారు. కరోనా నుంచి కోలు కున్నప్పటికీని ఆయన అనారోగ్యంతో ఇబ్బందిప డుతూనే ఉన్నారు. 2021 ఏప్రిల్‌లో కోవిడ్ చిక్కిన బప్పిలహరి ముంబైలో జూహులోని స్వగృహంలో వీల్ చైర్లోనే ఉన్నారట.
సంగీత ప్రపంచంలో బప్పిలహరిది సెపరేటు రూటు. ముంబైలో డిస్కోమ్యూజిక్ మరింత సౌండింగ్‌తో వినపడింది బప్పిలహరివల్లే. ఎన్నోభాషల్లో బప్పిలహరి పాటలు పాడారు. ముఖ్యంగా అమర్ సంగీ, ఆశా
ఓ భలో భాషా, అమర్ తుమీ, అమర్ ప్రేమ్, మందిర, బద్నాం ఇలా ఎన్నో బెంగాలీ హిట్స్ ఇచ్చారు
బప్పిలహరి. ముఖ్యంగా 1980– 1990 కాలంలో బప్పిలహరి మ్యూజిక్ సంగీత ప్రపంచాన్ని ఊర్రూత
లూగించింది. డిస్కోడాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్ వంటి సౌండ్ ట్రాక్స్ కూడా బప్పిలహరిని మరింత పాపులర్
చేశాయి. తన కంపోజింగ్‌లో వచ్చిన ఎన్నో పాటలకు బప్పిలహరియే ఆలపించారు.
ఇక తెలుగు సినీ పరిశ్రమతోనూ బప్పిలహరికి ప్రత్యేక అనుబంధం ఉంది. 1986లో వచ్చిన కృష్ణ సంహాసనం
చిత్రం మ్యూజిక్డైరెక్టర్గా బప్పిలహరికి తొలి చిత్రం. ఆ తర్వాత స్టేట్‌రౌడీ, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, బిగ్
బాస్ …ఇలా ఎన్నో తెలుగు చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు బప్పిలహరి. రవితేజ హీరోగా నటించిన డిస్కోరాజా చిత్రంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చేసిన రమ్ పమ్ బమ్ పాటను పాడారు బప్పిలహరి.
ఇటు రాజకీయంగాను బప్పిలహరి తన అదృష్టాన్ని పరిక్షీంచుకున్నారు. 2014లో బీజేపీ తరఫున పశ్చిమ బెంగాల్‌లోని శ్రీరామ్‌పూర్‌లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. అయితే ఆ తర్వాత
మ్యూజిక్ డైరెక్టర్‌గా బప్పిలహరి మళ్లీ మ్యూజిక్ కంపోజర్‌గా బిజీ అయ్యారు.
Queen of Melody Lata Mangeshkar (92) Died
కొంపముంచిన పవన్‌కల్యాణ్..షాక్‌లో అజిత్, వరుణ్‌తేజ్, శర్వానంద్