రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఇందులో రవితేజ ఎమ్మార్వో పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ మారెడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగు తుంది. థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ లొకేషన్లో షూటింగ్ పూర్తి చేసిన తరువాత విదేశాల్లో పాటల చిత్రీకరణ జరుపనున్నారు. ఈ చిత్రం యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది.
దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మరికొంత మంది ముఖ్య నటీనటులు యాక్ట్ చేస్తున్నారు. స్యామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అంది స్తున్నారు. సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్.