ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం “పుష్పక విమానం”. గీత్ సైని, శాన్వి మేఘన నాయికలుగా నటించారు. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మా తలుగా వ్యవహరించారు. నవంబర్ 12న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతోంది “పుష్పక విమానం”. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం విశాఖ గోకుల్ పార్క్ లో విజయ్, ఆనంద్ దేవరకొండ ఫ్యాన్స్, స్థానిక సినీ ప్రియుల కేరింతల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా..
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ…
ఫిల్మ్ ప్రొడక్షన్ అనేది చాలా కష్టం, ఒత్తిడితో కూడుకున్న విషయం. నా సినిమాలు, స్క్రిప్ట్స్, షూటింగ్ లొకేషన్స్, మీటింగ్స్…ఇలా నా సినిమాలను గురించిన పనులతోనే నాకు రోజంతా గడిచిపోతుంది. నాకు దిక్కు లేదు. నా పనులు నేనే చేసుకోవాలి. అందుకే ఒక్కొక్కసారి ప్రొడక్షన్ అవసరమా? అని పిస్తుంటుంది. కానీ కొత్తవారు తమకు దక్కిన అవకాశల గురంచి గర్వంగా చెప్పుకుంటుంటే కష్టమైనా సరే ప్రొడక్షన్‌ను కంటిన్యూ చేయాలనిపిస్తుంది. యాక్టర్‌గా నా కెరీర్ స్టార్టింగ్ స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేసి అవకాశాలను కల్పిస్తుండటం నా సక్సెస్‌కు ఓ అర్థాన్ని, వ్యక్తి గతంగా నాకు సంతృప్తిని ఇస్తుంది. మీకు మంచి సినిమాలు, కొత్త తరహా చిత్రాలు చేయాలనేది ఒక్కటే నా జీవిత ఆశయం. అనుకున్నది సాధించ గలనన్న నా ఆత్మవిశ్వాసం, మీ పై ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్…ఇది మీపై ఉన్న నమ్మకమే నన్ను మరింత ముందుకు తీసుకుని వెళుతుంది.దర్శకుడు దామోదర చాలా టాలెెంటెడ్ టెక్నీషియన్. చాలా కాలంగా తెలుసు. మాకొక మంచి సినిమా చేసి ఇచ్చాడు. ఆనంద్ ను చిట్టిలంక సుందర్ క్యారెక్టర్ లో ముందు ఊహించలేకపోయాను. కానీ అతను పర్మార్మ్ చేసి చూపించాడు. నటించడం ఒక్కటే కాదు ప్రొడక్షన్ లో, ప్రమోషన్ లో అన్నింట్లో తాను ఇన్వాల్వ్ అయి సూపర్ సినిమా తీసుకొచ్చాడు. శాన్వీ మేఘన, గీత్ సైని లకు హీరోయిన్స్ గా మంచి పేరొస్తుంది. వాళ్లకు ఇంకా ఆఫర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలని ఇండస్ట్రీని కోరుతున్నా. మీ అభిమానం ఎప్పుడూ కావాలని కోరుకుంటున్నాను
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ…నేను హీరోగా ఇవాళ మీ ముందు ఉన్నానంటే కారణం అన్నయ్య, నాన్న. అన్నయ్య విజయ్ ఎంతో కష్టపడి స్టార్ హీరో అయ్యాడు. ఆయన వేసిన దారిలో నేను ఈజీగా నడుచుకుంటూ మీ ముందుకు వచ్చాను. కానీ విజయ్ ఎప్పుడూ నాకు సొంతంగా ఎదగమనే చెబుతుంటాడు. ఆ మాట ప్రకారం ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుని నేను చేసిన చిత్రమిది. రెగ్యులర్ హీరో క్యారెక్టర్ లా ఈ చిత్రంలో నా పాత్ర ఉండదు. సహజంగా మీ చుట్టూ కనిపించే ఒక పాత్ర చిట్టిలంక సుందర్ ది. పెళ్లి చేసుకుని హాయిగా ఉందామనుకుంటే అతని భార్య లేచిపోతుంది. ఎందుకు అనేది థియేటర్ లో చూడండి. ఫన్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ అన్ని అంశాలు పుష్పక విమానం చిత్రంలో ఉంటాయి. మీరు సినిమా స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూపు దృష్టి మరల్చకుండా సినిమా చూస్తారు. పుష్పక విమానం గురించి మీరు ఎదురుచూస్తున్నారని తెలుసు. నవంబర్ 12న థియేటర్లలో కలుద్దాం. అన్నారు.
దర్శకుడు దామోదర మాట్లాడుతూ…పుష్పక విమానం సాంకేతికంగా, ఆర్టిస్టుల పర్మార్మెన్స్ పరంగా బలమైన సినిమా. హీరో క్యారెక్టర్ ను ఎంజాయ్ చేయాలంటే మా చిత్రానికి రండి. ఆనంద్ అంత బాగా నటించాడు. ఈ చిత్రంలో టెక్నీషియన్స్, నటీనటులు కథను ఎంతగా ఓన్ చేసుకున్నారంటే, ఇలా బాగుంటుంది అంటూ నాకు ఎన్నో సలహాలు ఇచ్చేవారు. పుష్పక విమానం చూశాక విజయ్ లాగే ఆనంద్ కు కూడా లేడీ ఫ్యాన్స్ పెరుగుతారు. అన్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు హర్ష ,నిర్మాత విజయ్ మట్టపల్లి , మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్, హీరోయిన్ శాన్వీ మేఘన, హీరోయిన్ గీత్ సైని పాల్గొని సినిమా సక్సెస్ కావాలని మాట్లాడారు,