హీరో సునీల్ విలన్ పాత్రలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రవితేజ డిస్కో రాజా
శర్వానంద్ రణరంగం
, సుహాస్ కలర్ ఫోటో
చిత్రాలలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో సునీల్ నటించారు . బుజ్జి ఇలరా..
, ఎఫ్ 3
. రామ్‌చరణ్ 15. చిత్రాల్లో లీడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందు తున్న పుష్ప ది రైజ్
చిత్రంలో సునీల్ మరో నెగటివ్ రోల్ చేస్తు న్నారు. ఈ సినిమాలో మంగళం శ్రీను పాత్రల్లో కనిపించనున్నారు సునీల్. నవంబరు 7న మంగళం శీను ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. సునీల్ కమిట్ అవుతున్న సినిమాలను బట్టి.. టాప్ హీరోస్ నటిస్తున్న వాటిలో మాత్రమే కామెడీ రోల్స్ చేయ డానికి సునీల్ ఆసక్తి చూపిస్తున్నారు
కానీ ..మిడిల్ రేంజ్ హీరోలతో కామిక్ రోల్స్ అంటే నో అని…సీరియస్ అండ్ విలన్ రోల్స్ అయితే ఓ ఎస్
అని సునీల్ చెబుతున్నట్లుగా తెలుస్తుంది. ఇలా కామెడీ పాత్రలకు సునీల్ మెల్ల మెల్లగా మంగళం పాడు
తున్నట్లు తెలుస్తుంది.

