దర్శకుడు శంకర్ కోసం రామ్‌చరణ్ ‘సీఈవో’(చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్)గా మారారు. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘సీఈవో’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని తెలిసింది. ఇదివరకే ‘సర్కారోడు’, ‘అధికారి’ వంటి టైటిల్స్ తెరపైకి వచ్చినప్పటికీని అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండేలా ‘సీఈవో’ టైటిల్ అయితే బాగుటుందన్నట్లుగా చిత్రంయూనిట్ భావిస్తోంది. ఈ సినిమా టైటిల్‌ను మార్చి 27 అంటే చరణ్ బర్త్ డే సందర్భంగా అధికారికంగా ప్రకటించడానికి చిత్రంయూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌జేసూర్య, సునీల్, శ్రీకాంత్, నవీన్‌చంద్ర, అంజలి కీ రోల్స్ చేస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్రంయూనిట్గా ఉన్నట్లుగా తెలుస్తోంది.
రామ్‌చరణ్ కెరీర్లో 15వ సినిమా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా చరణ్ కనిపిస్తారు. 1920 నేపథ్యంలో సాగే ప్లాఫ్బ్యాక్ ఎపిపోడ్‌లో రాజకీయ పార్టీ ‘అభ్యుదయం పార్టీ’ నేతగా కనిపిస్తారు రామ్ చరణ్. సమకాలీన సీన్స్‌లో ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు రామ్‌చరణ్. ఓ ఐఏఎస్ ఆఫీసర్‌గా వీధుల్లోభాగంగా ఓ ప్రాంతానికి చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్‌గా నియమించబడతారు చరణ్. 1920 జరిగే ఎలక్షన్స్‌కు, తాజాగా జరిగే ఎలక్షన్స్‌కు ఉన్న సంబంధం ఏమిటీ అన్నదే కథ. ఎలక్షన్స్ విషయంలో తన తండ్రికి అన్యాయం చేసిన స్వార్థ రాజకీయ నాయకులపై ఆ తర్వాత ఓ ఐఎఎస్ ఆఫీసర్‌గా చరణ్ ఏ విధంగా పగ తీర్చుకున్నాడు అన్నదే కథ. అలాగే ఎలక్షన్స్ సమయంలో ఐఎఎస్ ఆఫీసర్లు రాజకీయ నాయకుల చేతుల్లో పావుల్లా మారకుండ, ఆఫీసర్లకు ఉండే విధులతో రాజకీయనాయకుల ఆగడాలను ఏ విధంగా కట్టడి చేయవచ్చు, జీరో కరప్షన్ పాలిటిక్స్, ఓటింగ్ పట్ల ప్రజలను చైతన్య వంతులను చేయడం వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. అయితే తెలుగురాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఇలాంటి ఓ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ రావడం అనేది ఆసక్తికరమైన విషయంగానే చెప్పవచ్చు.
హాలీవుడ్‌కు చరణ్
ఆస్కార్ బరిలో నిలిచిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని నాటు నాటు ప్రమోషన్స్‌లో భాగంగా ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో ఉన్నారు. అక్కడ ఓ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తన హాలీవుడ్ డెబ్యూను
గురించిన వార్త వస్తుందని చరణ్ పేర్కొన్నారు.