చాలాకాలం తర్వాత హీరోయిన్ సమంత తెలుగు సినిమా సెట్స్‌లో అడుగుపెట్టారు. కొంతకాలంగా కండరాలకు సంబంధించిన మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉన్నారు. ఈ వ్యాధి నుంచి కాస్త కోలుకున్న సమంత ఇప్పుడు ఇంతకుముందు ఒప్పుకున్న సినిమాల కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగానే సమంత మార్చి 8న ఖుషిసినిమా సెట్స్‌లో పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సమంత తిరిగి సినిమా సెట్స్‌లో జాయిన కావడం విశేషం. విజయ్‌దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీమూవీమేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాను 2023 డిసెంబరు 23న విడుదల చేయాలనుకున్నారు. మయోసైటిస్ వ్యాధితో సమంత ‘ఖుషి’ షూటింగ్‌లో పాల్గొన లేకపోవడం, ఆమె కాల్షీట్స్ సర్దుబాటు విషయం వంటి అంశాలు ‘ఖుషి’ సినిమా రిలీజ్ కావడానికి కారణాలుగా నిలిచాయి.
‘ఖుషి’ సినిమా కాకుండ ప్రస్తుతం ఇండియన్ వెర్షన్ ‘సిటాడెల్’లో ఓ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు సమంత. మరో మెయిన్ లీడ్ బాలీవుడ్ హీరో వరుణ్‌ధావన్ చేస్తున్నారు. ‘ది ఫ్యామిలీమేన్’ సిరీస్‌తో క్రేజ్ సంపాదించుకున్న రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా కాకుండ సమంత నటించిన పీరియాడికల్ లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.