‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఈ నెల 12 లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న 95వ ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది. ఈ తరుణంలో ఈ ఆస్కార్ ప్రమోషన్‌లో భాగంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ అంతా అమెరికాలో ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పుడు కాదు..గోల్డెన్‌గ్లోబ్, క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్, క్రిటిక్స్ చాయిస్ సూపర్ అవార్డ్స్’ ‘బాఫ్టా’ అవార్డ్స్ పోటీలో నిలిచేందుకు ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ అమెరికాలో భారీగానే ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారం ఖర్చు దాదాపు 80 కోట్ల రూపాయలు ఉంటుందనే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో వినిపించాయి.


ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ 80 కోట్ల రూపాయలను ఖర్చు చేయడాన్ని దర్శక–నిర్మాత, నటడు తమ్మారెడ్డి భరద్వాజ్ విమర్శించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆర్‌ఆర్‌ఆర్ ఆస్కార్ ప్రమోషన్ ఖర్చు గురించి వ్యంగ్యంగా మాట్లాడారు. ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చు పెట్టాలా? మాకిస్తే ఓ పది సినిమాలు తీసి వారి మోఖాన కొడతాం అంటూ మాట్లాడారు. ఇంత చులకనగా మాట్లాడటంతో తమ్మారెడ్డి వ్యాఖ్యలు ఫిల్మ్‌నగర్‌లో ఓ హాట్‌టాపిక్‌గా మారాయి. దీంతో ఈ విషయంపై దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు స్పందించారు. ‘తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు, ప్రపంచవేదికలపై వస్తున్న గుర్తింపు చూసి గర్వపడాలి..అంతే కానీ 80 కోట్ల రూపాయల ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మెషన్ ఏమైనా ఉందా..? హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్‌కామెరూన్, స్పిల్ బర్గ్ వంటివారు డబ్బులు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడు తున్నారని నీ ఉద్దేశమా?’ అంటూ ట్వీట్ చేశారు. మరి..ఈ వివాదం ఇంతటితో ముగస్తుందా? లేక మరో మెట్టుపైకి వెళ్తుందా? అనేది చూడాలి.
— Raghavendra Rao K (@Ragavendraraoba) March 9, 2023