రామ్‌చరణ్ ఒక హీరోగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే ఏడాది జనవరి 07న విడుదల కానుంది. ఈ నెక్ట్స్ మంత్ ఫిబ్రవరి 04న ఆచార్య చిత్రం విడుదల కానుంది. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర చేశారు. అనుకున్నట్లుగా ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాలు విడుదలైతే రామ్ చరణ్‌ను నెలరోజుల గ్యాప్‌లో సిల్వర్‌స్క్రీన్‌పై రెండుసార్లు చూడొచ్చు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తి కావడానికి కనీసం ఏడాదిన్నర పడుతుంది. ఈ ప్రకారంగా ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ల తర్వాత రామ్‌చరణ్ సిల్వర్‌స్క్రీన్‌పై మళ్లీ కనిపించేది 2023లోనే.
రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు పండగే..నెల రోజుల గ్యాప్‌లో రెండుసార్లు కనిపించనున్న చరణ్
Leave a comment
Leave a comment