పవన్ కల్యాణ్, పోసాని కృష్ణమురళిల మధ్య ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామలు తెలిసిందే. రాజకీయ భావ వైరుధ్యంతో ఇద్దరు ఒకరొకరిపై ఆరోపణులు చేసుకున్నారు. అయితే పోసానీ తిరుపట్ల
ఇండస్ట్రీలో కొంత నెగటివ్ భావన ఏర్పడింది. పైగా మెగాఫ్యామిలీ హీరో అయిన పవన్‌కల్యాణ్‌పై పోసానీ
మాట్లాడిన తీరు ఇండస్ట్రీలోని చాలామందికి రుచించలేదు. అయితే సన్ ఆఫ్ ఇండియా ప్రి రీలీజ్
ఫంక్షన్లో పోసాని మాట్లాడిన అంశాలు ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. తనకు అవకాశాలు
రాకపోయిన పర్లేదు అని, ఆల్రెడీ సంపాదించుకున్నానని చెప్పుకొచ్చారు పోసానీ కృష్ణమురళీ.
పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ – “పరుచూరి బ్రదర్స్‌తో ఐదు సంవత్సరాల అసోసియేషన్ తర్వాత వారిలా మాత్ర నేను జీవించకూడదు అనుకున్నాను. పరుచూరి బ్రదర్స్‌కు పొగరని చాలామంది అను
కుంటారు. కానీ వారు ఎలా జీవించాలో కూడా తెలియనివారు. ఇరవైఏళ్ళుగా వారు ఓ మంచి సినిమాను
రాయలేకపోయారు. అలాంటి పరచూరి బ్రదర్స్‌ని, అంతకంటే ఎక్కువైన ఆత్రేయగారిని ఈ పరిశ్రమ
ఎలా ట్రీట్ చేసిందో చూశాం. అలా ఆత్రేయగారిని, వేటూరిగారిని, శ్రీశ్రీగారిని..ఇలా చాలామందిని చూసి..ఈ బతుకు మనకు వద్దు. నేను నాలానే బ్రతకాలి. ఇండస్ట్రీలో నేను అన్నకున్నట్లు బతికితేనే జీవితాంతం పరిశ్రమలో ఉండగలను ఉంటాను. లేకపోతే సగం జీవితంలోనే పరిశ్రమలో కుక్క చావు చస్తా. ఇండస్ట్రీలో చావంటే ఖరీదుగా ఉండాలి. పేదరికపు చావు పదిమందిని తీసుకురాదు. అలాగే డబ్బున్న చావు పదివేలమందిని తీసుకుని వస్తుంది. అందుకే ఈ రెండు చావుల మధ్య బతకడం నాకు ఇష్టం లేక నేను, నా కుటుంబం కాస్త దూరంగా బతుకుతున్నాం. భవిష్యత్‌లో..తెలుగు సినిమా పరిశ్రమ..పోసాని కృష్ణమురళీని బహిష్కరించానా? నా వారసులు జీవించగలిగినంద నేను సంపాదించా ను. ఇందులో నేను చెంచాగామారి గిరి చేస్తూ వాళ్ళకు వీళ్ళకు మందుగ్లాసులు అందించడం నాకు రాదు. అలాంటి చెంచాగిరి బతుకు నాకు వద్దనుకున్నాను. ఇండస్ట్రీ నుంచి కొత్త ఏమీ ఆశించడం లేదు. ఇక ఏదైనా వస్తే అది నాకు బోనసే
అని అన్నారు