మైథలాజికల్ ఫిల్మ్స్ అంటే గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఎంత ఖర్చు చేస్తే అంత రిచ్ గ్రాండియర్ నెస్ సిల్వర్‌స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఈ విషయంలో ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రం యూనిట్ ఏమాత్రం కాంప్రమైజ్ కావాలనుకోవడం లేదని తెలుస్తోంది. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆది పురుష్’ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీసనన్, రావణుడిగా సైఫ్‌అలీఖాన్ నటించారు. 103 రోజుల పాటు సాగిన ఈ సినిమా షూటింగ్ పూరై్త రెండు నెలలు అవుతోంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కోసం భారీగా గ్రాఫిక్స్ చేస్తున్నారు చిత్రంయూనిట్. అయితే ఒక్క అడవి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలకే చిత్రంయూనిట్ 60 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందట. అంటే ఈ సినిమా రిచ్ నెస్ వెండితెరపై ఎలా ఉంటుందో అర్థం చేసు కోవచ్చు. ఈ విజువల్ వండర్ ఫిల్మ్‌ను చూడాలంటే ఆగస్టు 11 వరకు వేచి ఉండాల్సిందే. ఎందుకంటే ఆది పురుష్ చిత్రం ఆ రోజే థియేటర్స్‌లో విడుదల కానుంది.

ఇక ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ మార్చి 11న విడుదల కానుంది. ఈ చిత్రం కాకుండా…ప్రభాస్ ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘స్పిరిట్’ వంటి సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సంగతి ఇలా ఉంచితే…ఈ వారంలో ప్రభాస్ ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో పాల్గొంటారని తెలిసింది. దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్ కీలక పాత్రధారి. నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకుడు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.