కరోనా ప్రభావంతో కాస్త ఒడిదుడుకులకు లోనైన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మెల్లిగా గాడిన పడుతోంది. టాప్ హీరోలు ప్రభాస్, మహేశ్‌బాబు, రామ్‌చరణ్ తమ సినిమా షూటింగ్స్‌ను తిరిగి స్టార్ట్ చేశారు.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె చిత్రం రూపుదిద్దుకుంటుంది. అయితే ఈ చిత్రంలో దీపి కా పదుకొనె హీరోయిన్గా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రధారి. అయితే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో తిరిగి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ కూడా పాల్గొంటారని తెలిసింది. అయితే ఈ షెడ్యూల్ షూటింగ్ జరిగేది కేవలం పది రోజులే అని తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలను కుంటున్నారు.
ఇక కొంతగ్యాప్ తర్వాత మహేశ్‌బాబు ‘సర్కారువారిపాట’ షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ స్టారై్ట ఆల్రెడీ పదిరోజులు అవుతున్నప్పటికీని మహేశ్ ఈ సినిమా సెట్స్‌లో జాయినై కేవలంరెండు రోజులే అవుతోంది. అయితే ఇటీవల మొదలైన ఈ సినిమా షూటింగ్లో నిన్నమొన్నటివరకుకీర్తీ సురేశ్‌పై కీలక సన్నివేశాలను తీశారు. తాజాగా యాక్షన్ సీక్వెన్స్‌ను మహేశ్‌బాబుపై తెరకెక్కిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా మే 12న విడుదల కానుంది.
ఈ సంగతి ఇలా ఉంచితే…సర్కారువారిపాట చిత్రంలోని లిరికల్ వీడియోను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ కళావతి సాంగ్ లీకైపోయింది. దీంతో ఒకరోజు
ముందుగానే రిలీజ్ చేశారు చిత్రబృందం. అయితే ఈ సినిమాలో కళావతి సాంగ్ ఆన్లైన్లో రిలీజ్
కావడం పట్ల ఈ చిత్రం సంగీత దర్శకుడు తమన్ తీవ్రమనస్తాపం చెందారు. ఆడియో సందేశాలను
విడుదల చేశారు.
ఇక కొంతలాంగ్ గ్యాప్ తర్వాత శంకర్ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు రామ్‌చరణ్. ఈ సినిమా తాజాగా షెడ్యూల్ రాజమండ్రిలో ప్రారంభమైందని తెలిసింది. దాదాపు 15 రోజులపాటు ఈ సినిమా షూటింగ్ అక్కడ జరుగుతుంది. కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్రంయూనిట్.