ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ నెక్ట్స్ షెడ్యూల్ ఫిబ్రవరి 16 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో దీపికాపదుకొనె హీరోయిన్‌కాగా, అమితాబ్‌బచ్చన్ ఓ కీ రోల్ చేస్తున్నారు. అయితే ప్రాజెక్ట్ కె లెటేస్ట్ షెడ్యూల్ కోసం అమితాబ్ బచ్చన్హైదరాబాద్ వచ్చారు. అయితే అక్కడ భీమ్లానాయక్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు పవన్‌కల్యాణ్. అమితాబ్ బచ్చన్ వచ్చారని తెలుసుకున్న పవన్‌కల్యాణ్..మర్యాదగా వెళ్లి ఆయన్ను కలిసి కాసేపు మాట్లాడారట. ఇక ప్రాజెక్ట్ కె చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్రం నిర్మాత అశ్వనీదత్ వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొం దుతోన్న భీమ్లానాయక్ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. సాగర్ కె చంద్ర దర్శకుడు.
రామ్‌చరణ్, కొరటాల శివ కాంబినేషన్ సెట్!..షాక్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్