చిరంజీవి హీరోగా నటించిన తాజా సినిమా ‘ఆచార్య’. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీ రోల్ చేశారు. అంతేకాదు..ఆచార్య సినిమాకు రామ్‌చరణ్ కూడా ఓ నిర్మాత. ఈ సినిమా
ఏప్రిల్ 29న విడుదల కానుంది.

అయితే కాసేపు ఆచార్య విషయాన్ని పక్కనపెడితే…రామ్‌చరణ్ హీరోగా కొరటాల శివ దర్శకుడిగా ఓ సినిమాకు సన్నాహాలు మొదలైయ్యాయన్నది ఫిల్మ్‌నగర్ లేటెస్ట్ గాసిప్. అయితే ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లోని సినిమాతో రామ్‌చరణ్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2023లో వస్తుంది. ఈ సినిమా తర్వాత ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో ఓ సినిమా కమిటైయ్యారు రామ్‌చరణ్. అలాగే దర్శకులు ప్రశాంత్‌నీల్, సుకుమార్, ఓ బడా బాలీవుడ్ దర్శకుడితో రామ్‌చరణ్ కొత్త సినిమాలు కమిౖటెæయ్యారని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ తరుణంలో కొరటాల శివ– రామ్‌చరణ్ కాంబినేషన్‌కుసంబంధించిన సినిమాను గురించిన చర్చతెరపైకి రావడం విశేషం. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్‌తో సినిమాచేస్తున్నారు కొరటాల శివ. ఈ సినిమా పూర్తయిన తర్వాతే రామ్‌చరణ్‌తో కొరటాల శివ సినిమా చేస్తారట. ఈ లోపు రామ్‌చరణ్ కూడా తన ప్రియారిటీ కమిట్‌మెంట్స్‌ను కంప్లీట్ చేస్తారన్నది వినికిడి.
మరోవైపు అల్లు అర్జున్, కొరటాల శివ కాంబినేషన్లోని సినిమా ఈ ఏడాదికి వాయిదా పడింది. అందరు
ఎన్టీఆర్ తర్వాత అల్లు అర్జున్‌తోనే కొరటాల శివ సినిమా చేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ తరుణంలోరామ్‌చరణ్– కొరటాల శివ కాంబినేషన్‌ను గురించిన వార్త తెరపైకి రావడం కాస్త ఆశ్చరకరమైన విషయమే అని చెప్పాలి. అయితే రామ్‌చరణ్– కొరటాల శివ కాంబినేషన్‌ను గురించి అధికారిక ప్రకటన వస్తే కానీ ఈ విష యంపై ఓ కార్లిటీ రాదు.