నిన్నమొన్నటి వరకు యశ్ ‘కేజీఎఫ్ 2’, ఆమిర్‌ఖాన్ ‘లాల్‌సింగ్ చద్దా’ ఏప్రిల్ 14న విడుదల కావాల్సిన చిత్రాలు. అయితే లాల్‌సింగ్ చద్దా చిత్రం ఆగస్టు 11కి వాయిదా పడింది. దీంతో ఇదే తేదీన విడుదల కావాల్సిన ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా వాయిదా పడినట్లయింది. అయితే ఆగస్టు 11న వచ్చేందుకుప్రభాస్ తప్పకున్నా..అక్షయ్ ససేమిరా అంటున్నాడు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన రక్షాబంధన్ చిత్రం కూడా లాల్‌సింగ్ చద్దాతో పాటు ఆగస్టు 11నే రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరి..యశ్‌తో కాదనుకోని, అక్షయ్‌తో పోటీకి దిగిన ఆమిర్ బాక్సాఫీస్ ఫైట్‌లో గెలుస్తాడా? లేదా లాల్‌సింగ్ చద్దా, రక్షాబంధన్ చిత్రాల్లో ఏదో ఒక చిత్రం వాయిదా పడుతుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి.