పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్‌లు కలిసి హీరోలుగా ఓ సినిమా చేయనున్నారని తెలిసింది. ఈ సినిమాకు ప్రముక తమిళం దర్శకుడు, యాక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుంది. గతంలో పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా ఓ 15 సినిమాలను నిర్మించాలనుకున్నారు. అప్పుడు చెప్పిన వివరాల ప్రకారం ఆరు చిన్న చిత్రాలు, ఆరు మీడియం బడ్జెట్ చిత్రాలు, మూడు భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలో భాగంగా పవన్,సాయిధరమ్‌తేజ్ కలిసి ఓ సినిమా చేయనున్నారన్నది ఫిల్మ్‌నగర్ లేటెస్ట్ టాక్.
ప్రస్తుతం పవన్‌కల్యాణ్ ‘భీమ్లానాయక్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత పెండింగ్‌లో ఉన్న ‘హరి హర వీరమల్లు’ను కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత ‘గబ్బీర్సింగ్’ డైరెక్టర్ హరీష్‌శంకర్‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’, సురేందర్‌రెడ్డితో రామ్‌తాళ్లూరి నిర్మాతగా ఓ సినిమాలకు కమిటైయ్యారు పవన్‌కల్యాణ్. మరి.. ఈ సినిమాలను పూర్తి చేసిన తర్వాతే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన సినిమాను టేకప్ చేస్తారా? లేక మధ్యలోనే సినిమాను సెట్స్‌పైకి తీసుకుని వెళ్తారా? అనే విషయంపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇటు రాజకీయాలవైపు కూడా పవన్‌కల్యాణ్ దృష్టి సారించాల్సిన సమయం ఇది. సో…ప్రొఫెషనల్ కెరీర్‌ను, పర్సనల్ కెరీర్‌ను పవన్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి. మరి..!