Nani Dasara:‘ దసరా’ సెట్స్‌లో చిందులేస్తున్నారు నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా ‘దసరా’. నాని, కీర్తీ సురేశ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తెలంగాణలోని గోదావరిఖనిలో జరుగుతోంది. సాంగ్ షూట్ జరుగుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ సాంగ్ ఫేమ్ ప్రేమ్‌రక్షిత్ ఈ పాటకు కొరియోగ్రాఫర్. ఈ పాటలో దాదాపు 500మంది డ్యాన్సర్స్ పాల్గొంటు న్నారు. గోదావరి ఖనిలోని సింగరేణి పాత్రంలోని ఓ గ్రామంలో సినిమా కథ సాగుతుంది. ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనావహాబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Nani Dasara:దసరా టైటిల్ మాదే అంటున్న కన్నడ నటుడు, షాక్‌లో నాని
కన్నడ ఇండస్ట్రీలో మరో చిత్రం కూడా ‘దసరా’ అనే టైటిల్‌తో రూపొందింది. ఈ నేపథ్యంలో ఈ టైటిల్ ఏ సినిమాకు ఫైనల్ అవుతుందనే అంశంపై కూడా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మరోవైపు దసరా సినిమా కాకుండా నాని ‘అంటే ..సుందరానికీ’ అనే సినిమా కూడ చేస్తున్నారు. వివేక్ అత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తో మలయాళ బ్యూటీ నజ్రియా టాలీవుడ్‌కు వస్తున్నారు. అంటే..సుందరానికీ సినిమా జూన్ 10న రిలీజ్ కానుంది.